హైదరాబాద్, వెలుగు: బొండాడ ఇంజినీరింగ్ లిమిటెడఖ ఈ ఏడాది మార్చితో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.211 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది లాభం రూ.113 కోట్లతో పోలిస్తే ఇది 86 శాతం ఎక్కువ. ఆదాయం కూడా 81 శాతం పెరిగి రూ.2,843 కోట్లకు చేరింది. పునరుత్పాదక ఇంధనం, టెలికాం, రైల్వే విభాగాల్లో కార్యకలాపాలు విస్తరించడం వల్ల ఈ వృద్ధి సాధ్యమైందని కంపెనీ తెలిపింది.
కార్యకలాపాల ద్వారా వచ్చే నగదు ప్రవాహం (క్యాష్ ఫ్లో) గత ఆర్థిక సంవత్సరంలో మైనస్ రూ.141 కోట్లు ఉండగా ఈ ఏడాది ప్లస్ రూ.125 కోట్లకు మెరుగుపడటం విశేషం. నాలుగో క్వార్టర్లో బొండాడ ఇంజినీరింగ్ రూ.914 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలో ఉన్న రూ.714 కోట్లతో పోలిస్తే ఇది 28 శాతం పెరిగింది. నికర లాభం 13 శాతం వృద్ధితో రూ.63 కోట్లుగా నమోదైంది.

