
‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత పూర్తిస్థాయి మాస్ ఎంటర్‌టైనర్స్‌పై ఫోకస్ పెట్టిన హీరో రామ్ పోతినేని.. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో నటిస్తున్నాడు. రామ్ కెరీర్‌లో ఇది 20వ చిత్రం. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. బోయపాటి మార్క్ మాస్ ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్‌తో మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేలా ఈ సినిమా ఉండబోతుందని ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌తో అర్థమవుతోంది. తాజాగా మరో కొత్త అప్‌డేట్ ఇచ్చాడు హీరో రామ్.
గత ఇరవై నాలుగు రోజులుగా బ్రేక్ తీసుకోకుండా యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్నామని.. ఫైనల్‌గా ఈ షెడ్యూల్ పూర్తయిందని చెప్పాడు. ఇది క్లైమాక్స్ కాదు అంతకుమించి ఉండబోతోంది అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు రామ్. ఇన్ని రోజులపాటు షూట్ చేశారంటే క్లైమాక్స్ ఏ స్థాయిలో ఉండబోతోందా అనే ఆసక్తి నెలకొంది. ఇక తన గత సినిమాలకు భిన్నంగా ఇందులో కాస్త బరువు పెరిగి, రగ్గడ్ లుక్‌లో కనిపిస్తున్నాడు రామ్.శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 20న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.