
హైదరాబాద్ : సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్స్ అమ్మే ప్రీమియర్ డీలర్‌షిప్ బాయ్స్ అండ్ మెషీన్స్ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో షోరూమ్ తెరిచింది. మనదేశంలో ఈ కంపెనీకి ఇది నాలుగో షోరూమ్. దీనిని 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. కొనుగోలు, అమ్మకాలతోపాటు ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్, ఆర్‌టీఓ ట్రాన్స్‌ఫర్స్, కస్టమైజేషన్ సేవలను సైతం ఇక్కడ అందిస్తారు. 2020లో ఆరంభమైన బాయ్స్ అండ్ మెషీన్స్ ప్రస్తుతం ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతాలో షోరూమ్‌లు నడుపుతోంది.