ట్రంప్ ను కలిసిన బ్రెజిల్ అధికారికి కరోనా

ట్రంప్ ను కలిసిన బ్రెజిల్ అధికారికి కరోనా

ప్రపంచాన్నంతటిని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు విదేశీయులంతా భారతీయ సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు.  పలు దేశాధ్యక్షులు సైతం షేక్ హ్యాండ్ మానేసి రెండు చేతులు జోడించి గౌరవ ప్రదంగా నమస్కారం చేస్తున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అయితే కరోనా వైరస్ తన దరి చేరకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన అధికారిక సమావేశాల్లోనూ, సభల్లోనూ నమస్కారంతోనే ప్రతీ ఒక్కరిని పలకరిస్తున్నారు. అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఆయన్ను కలవరానికి గురి చేస్తే వార్త ఒకటి బయటికి వచ్చింది.

కొద్ది రోజుల క్రితం  ఫ్లోరిడాలోని డొనాల్డ్ ట్రంప్ రిసార్ట్‌లో జరిగిన సమావేశానికి బ్రెజిల్ ప్రభుత్వ అధికారి ఒకరు హాజరయ్యారు. అయితే అతనికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలినట్లు  బ్రెజిల్ ప్రభుత్వం గురువారం తెలిపింది. బ్రెజిల్ అధ్యక్షుడి యొక్క ప్రెస్ సెక్రటరీ అయిన ఫాబియో వాజ్గార్టెన్ ఈ వైరస్ భారిన పడ్డారని తెలిపింది. సదరు వ్యక్తి కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడి పక్కన నిలబడి ఉన్న ఫోటోను ఇంతకుముందు సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

అందులో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కూడా ఉన్నారు. దాంతో బోల్సోనారో కు కరోనా వచ్చిందని అక్కడి వైద్య బృందం పరీక్షలు చేయగా ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు.అయితే బ్రెజిల్ స్థానిక మీడియా అధ్యక్షుడికి కూడా కరోనా ఉన్నట్లు వార్తలు రాయగా.. బోల్సోనారో వాటిని ఖండించారు. ఆయన కరోనా నెగిటివ్ వచ్చిందని స్వయంగా ట్వీట్ చేశారు.

Brazilian president's press secretary tests positive for coronavirus, days after meeting Trump