డబ్బులు ఇవ్వడం లేదన్న కోపంతో .. బావను చంపిన బావమరుదులు

డబ్బులు ఇవ్వడం లేదన్న కోపంతో .. బావను చంపిన బావమరుదులు
  • ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా రుయ్యాడిలో ఘటన

ఆదిలాబాద్‌‌‌‌ టౌన్‌‌‌‌ (తలమడుగు), వెలుగు : డబ్బులు ఇవ్వడం లేదన్న కోపంతో ఇద్దరు వ్యక్తులు తమ బావను హత్య చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో బుధవారం జరిగింది. ఎస్సై రాధిక తెలిపిన వివరాల ప్రకారం.. తలమడుగు మండలంలోని నడింపెల్లి గ్రామానికి చెంది నైతం పగ్గు (58) రెండేండ్ల కింద తన భార్య కలిసి ఉపాధి కోసం రుయ్యాడి గ్రామానికి వచ్చి తన కూతురు భీంబాయి వద్ద ఉంటున్నాడు. పగ్గు నడింపెల్లి గ్రామం వదిలి వచ్చినప్పటి నుంచి పలు కార్యక్రమాలకు చందాలు ఇవ్వకపోవడంతో అతడి బావమరుదులు ఆత్రం భీంరావు, ఆత్రం రాములు తరచూ గొడవ పడేవారు. 

ఈ క్రమంలోనూ బుధవారం వారి మధ్య గొడవ జరిగింది. దీంతో భీంరావు, రాములు కలిసి తమ బావ పగ్గుపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ పగ్గు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి కూతురు భీంబాయి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.