బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యక్తల ఫైటింగ్

 బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యక్తల ఫైటింగ్

రంగారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యక్తల మధ్య వాగ్వాదం నెలకొంది. అంతటితో ఆగకుండా ఒకరినొకరు నెట్టేసుకున్నారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నా ఆగకుండా నడి రోడ్డుపైనే రెచ్చిపోయారు. వివరాల్లోకి వెళితే..  

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా పాత పోలీస్ స్టేషన్ వద్ద ఇరు పార్టీల వారు ఎదురెదురయ్యారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకరినొకరు నెట్టుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.