బీఎస్‌‌ఈకి సెబీ గ్రీన్ సిగ్నల్‌‌

బీఎస్‌‌ఈకి సెబీ గ్రీన్ సిగ్నల్‌‌
  • సపరేట్‌‌‌‌గా సోషల్  స్టాక్ ఎక్స్చేంజ్‌‌
  • బీఎస్‌‌ఈకి సెబీ గ్రీన్ సిగ్నల్‌‌

న్యూఢిల్లీ: సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్‌‌ (ఎస్‌‌ఎస్‌‌ఈ) ను సపరేట్ సెగ్మెంట్‌‌గా ఏర్పాటు చేసేందకు సెబీ నుంచి అనుమతులు వచ్చాయని బీఎస్‌‌ఈ ప్రకటించింది. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ (ఎన్‌‌పీఓ) లు, ప్రాఫిట్‌‌ కోసం నడిచే సోషల్ ఎంటర్‌‌‌‌ప్రైజ్‌‌లు ఫండ్స్‌‌ను సేకరించుకోవడానికి వీలుగా సోషల్ స్టాక్‌‌ ఎక్స్చేంజిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుత రూల్స్ ప్రకారం ఎస్‌‌ఎస్‌‌ఈ ఇప్పుడున్న స్టాక్ ఎక్స్చేంజిలకు సపరేట్‌‌గా ఏర్పాటవుతుంది. ఎక్స్చేంజిలో లిస్ట్ అవ్వడానికి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ల (ఎన్‌‌పీఓ) కు ఎటువంటి అర్హతలు ఉండాలో తెలియజేస్తూ   సెబీ కిందటి నెలలో ఫ్రేమ్‌‌ వర్క్‌‌ను విడుదల చేసింది. ఎస్‌‌ఎస్‌‌ఈలో లిస్టింగ్ కావాలంటే ఎన్‌‌పీఓలు ఛారిటబుల్ ట్రస్టులుగా మినిమమ్ మూడేళ్ల నుంచి  రిజిస్టర్ అయి ఉండాలి.  గత ఆర్థిక సంవత్సరంలో ఇవి చేసే ఖర్చులు కనీసం రూ.50 లక్షలు, కనీసం రూ. 10‌‌‌‌ లక్షలు ఫండింగ్ అందుకొని ఉండాలి.