బడ్జెట్ ఎఫెక్ట్: రూ.6 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

బడ్జెట్ ఎఫెక్ట్: రూ.6 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

మనీ సునామీ!

గత 24 ఏళ్లలో అతిపెద్ద బడ్జెట్‌ డే లాభం ఇదే

2,300 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌
బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: నిర్మలమ్మ తీసుకొచ్చిన బడ్జెట్‌‌‌‌ ఇండియన్‌‌‌‌ స్టాక్ మార్కెట్లకు తెగ నచ్చింది. ‘ఎటువంటి బ్యాడ్‌‌‌‌ న్యూస్‌‌‌‌ లేకపోవడమే  గుడ్‌‌‌‌ న్యూస్‌‌‌‌’ అన్నట్టు, బడ్జెట్‌‌‌‌లో కొత్త ట్యాక్స్‌‌‌‌ ప్రపోజల్స్‌‌‌‌ లేకపోవడంతో మార్కెట్లో బేర్స్‌‌‌‌ను బుల్స్‌‌‌‌ చిత్తు చిత్తు చేశాయి. సోమవారం సెషన్‌‌‌‌లో సెన్సెక్స్‌‌‌‌ 2,315 పాయింట్లు లాభపడి 48,601 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 647 పాయింట్లు పెరిగి 14,281 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రభుత్వ బ్యాంకులకు రూ. 20 వేల కోట్ల రీక్యాపిటలైజేషన్‌‌‌‌ను ప్రకటించడంతో నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్‌‌‌‌ ఏకంగా 2,524 పాయింట్లు పెరిగి ఆల్‌‌‌‌ టైమ్‌‌‌‌ రికార్డ్‌‌‌‌ 33,089 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. గత 24 ఏళ్లలో మార్కెట్లకు ఇదే అతిపెద్ద బడ్జెట్‌‌‌‌ డే లాభం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌‌‌ ప్రవేశ పెట్టిన గత రెండు బడ్జెట్ల రోజునా మార్కెట్లు నష్టపోయాయి.  గతేడాది ఏప్రిల్‌‌‌‌ తర్వాత బెంచ్‌‌‌‌ మార్క్‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌లకు ఇదే అతిపెద్ద సింగిల్‌‌‌‌డే గెయిన్‌‌‌‌ కూడా. ఈ ఒక్క సెషన్‌‌‌‌లోనే బీఎస్‌‌‌‌ఈలో ఇన్వెస్టర్ల సంపద రూ. 6.40 లక్షల కోట్లు పెరిగింది. గత వారంలో సుమారు 4 వేల పాయింట్లకు పైగా పడిన సెన్సెక్స్‌‌‌‌, సోమవారం ఒక్క రోజే తన నష్టాల్లో 60 శాతాన్ని రికవరీ చేసుకోగలిగింది.

కొత్త ట్యాక్స్‌‌లు లేవు..

కరోనా సెస్‌‌‌‌, హయ్యర్‌‌‌‌‌‌‌‌ క్యాపిటల్‌‌‌‌ గెయిన్ ట్యాక్స్‌‌‌‌, వెల్త్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ వంటి ట్యాక్స్‌‌‌‌లను ప్రభుత్వం విధిస్తుందని మార్కెట్‌‌‌‌ భయపడింది. కానీ బడ్జెట్‌‌‌‌లో వీటికి సంబంధించి ఎటువంటి ప్రస్తావన లేకపోవడం స్టాక్ మార్కెట్లకు పెద్ద ప్లస్‌‌‌‌గా మారింది. అంతేకాకుండా సిగరెట్లపై ట్యాక్స్‌‌‌‌ను ప్రభుత్వం టచ్‌‌‌‌ చేయకపోవడంతో హెవీవెయిట్‌‌‌‌ షేరు ఐటీసీ 6 శాతానికి పైగా పెరిగింది. సెన్సెక్స్‌‌‌‌ మరింత దూసుకుపోవడానికి ఇదొక కారణం. బుల్స్‌‌‌‌ విజృంభించడంతో  నిఫ్టీ ఫ్యూచర్స్‌‌‌‌లో ఓపెన్‌‌‌‌ ఇంట్రెస్ట్‌‌‌‌(ట్రేడయిన కాంట్రాక్ట్‌‌‌‌లు) 17 శాతం పెరిగింది.  బ్యాంక్ హెవీ వెయిట్‌‌‌‌ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో నిఫ్టీ బ్యాంక్ కొత్త రికార్డ్‌‌‌‌లను క్రియేట్ చేసింది. ‘ఎటువంటి పరోక్ష ట్యాక్స్‌‌‌‌లు విధించకుండానే ప్రభుత్వం తన ఖర్చులను పెంచింది. రెండు ప్రభుత్వ బ్యాంకులలో వాటాలను అమ్మ డం, బ్యాంకుల మొండిబాకీలను తగ్గించే చర్యలను ప్రకటించడంతో  బ్యాంక్ నిఫ్టీ దూసుకుపోయింది. ’ అని  జియోజిత్‌‌‌‌ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌ రీసెర్చ్ హెడ్‌‌‌‌ వినోద్‌‌‌‌ నాయర్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు.

మార్కెట్‌‌ను నడిపించాయి..

1.హెల్త్‌‌సెక్టార్‌‌‌‌, ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌పై ప్రభుత్వం తన ఖర్చులను పెంచింది. ద్రవ్యలోటు 2020–2021 లో 9.5 శాతంగా ఉన్నా, ఈ బడ్జెట్‌‌  గ్రోత్‌‌పై ఎక్కువ దృష్టి పెట్టింది.

2. కొత్తగా ట్యాక్స్‌‌లను  ప్రభుత్వం విధిస్తుందని మార్కెట్‌‌ భయపడింది. కానీ వీటి ప్రస్తావన బడ్జెట్‌‌లో లేదు.

3.వాలంటరీ వెహికల్‌‌ స్క్రాపింగ్‌‌ పాలసీని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఆటో షేర్లు భారీగా లాభపడ్డాయి. టాటా మోటార్స్‌‌, ఎం అండ్ ఎం, బజాజ్‌‌ ఆటో వంటి షేర్లు ఎక్కువగా పెరిగాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌‌ 4 శాతానికి పైగా ఎగిసింది.

4.ఉజ్వల స్కీమ్‌‌ కింద వచ్చే మూడేళ్లలో మరో 100 జిల్లాలకు  గ్యాస్‌‌ డిస్ట్రిబ్యూషన్‌‌ను ప్రభుత్వం విస్తరించనుంది. ఈ ప్రకటనతో గ్యాస్‌‌ డిస్ట్రిబ్యూషన్‌‌ షేర్లు లాభాల్లోకి వెళ్లాయి.

5.ఇన్సూరెన్స్‌‌ సెక్టార్లలో ఫారిన్ డైరక్ట్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్ల లిమిట్‌‌ను ప్రస్తుతం ఉన్న 49% నుంచి74%నికి ప్రభుత్వం పెంచింది.

6. హౌసింగ్‌‌ లోన్స్‌‌పై రాయితీలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం పొడిగించింది. అఫోర్డబుల్‌‌ హౌసింగ్‌‌ ప్రాజెక్ట్‌‌లపై ఏడాది పాటు ట్యాక్స్‌‌ హాలిడేను ప్రకటించింది. దీంతో రియల్‌‌ ఎస్టేట్‌‌ షేర్లు పెరిగాయి.

7. సెన్సెక్స్‌‌లో ఇండస్‌‌ ఇండ్‌‌ బ్యాంక్‌‌, ఐసీఐసీఐ బ్యాంక్‌‌, బజాజ్ ఫిన్సర్వ్‌‌ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. డా.రెడ్డీస్‌‌, టెక్‌‌మహింద్రా, హెచ్‌‌యూఎల్‌‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

8.అన్ని సెక్టార్ల ఇండెక్స్‌‌లు పాజిటివ్‌‌గా ముగిశాయి. ఎక్కువగా బ్యాంక్‌‌ ఇండెక్స్‌‌, ఫైనాన్స్‌‌, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్‌‌, మెటల్‌‌ ఇండెక్స్‌‌లు 8 శాతం వరకు ర్యాలీ చేశాయి. బీఎస్‌‌బీ మిడ్‌‌క్యాప్‌‌ , స్మాల్‌‌ క్యాప్‌‌ ఇండెక్స్‌‌లు 3.03 శాతం పెరిగాయి.

9. డాలర్‌‌‌‌ మారకంలో రూపాయి విలువ ఆరు పైసలు పడి 73.02 వద్ద క్లోజయ్యింది. బ్రెంట్‌‌ క్రూడ్‌‌ ఆయిల్‌‌ 0.89 శాతం పెరిగి బ్యారెల్ ధర  55.51 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది.

10. హాంకాంగ్‌‌, సియోల్‌‌, టోక్యో మార్కెట్లు పాజిటివ్‌‌గా ముగియగా, యూరప్ స్టాక్ ఎక్స్చేంజ్‌‌లు లాభాల్లో ఓపెన్‌‌ అయ్యాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇదొక గొప్ప బడ్జెట్‌‌. గ్రోత్‌‌ కోసం  ప్రభుత్వం ద్రవ్యలోటును పణంగా పెట్టింది. ట్యాక్స్‌‌లపై ఎటువంటి గందరగోళం లేదు. రెండు ప్రభుత్వ బ్యాంక్‌‌లలో వాటాలను విక్రయించడం, ఎల్‌‌ఐసీ ఐపీఓ, ఇన్సూరెన్స్‌‌ కంపెనీలలో ఫారిన్ ఓనర్‌‌‌‌షిప్‌‌లను పెంచడం వంటి చర్యలను స్టాక్‌‌ మార్కెట్లు స్వాగతం పలికాయి.-జైదీప్‌‌ హన్స్‌‌రాజ్‌‌, కోటక్ సెక్యూరిటీస్‌‌ సీఈఓ.

డైరక్ట్ ట్యాక్స్‌‌లలో ఎటువంటి మార్పులు లేని ఈ బడ్జెట్‌‌, చాలా కాలం వరకు  గుర్తుండి పోతుంది. క్యాపిటల్‌‌ గెయిన్స్ ట్యాక్స్‌‌ లేదా కోవిడ్ ట్యాక్స్‌‌లు వంటివి ఏం లేకపోవడంతో మార్కెట్లు భారీగా పెరిగాయి. రెండు ప్రభుత్వ బ్యాంకులలో వాటాలను అమ్మడం, ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎఫ్‌‌డీఐల వాటాను 74 శాతానికి పెంచడం వంటి చర్యలు మార్కెట్‌‌కు బూస్టప్‌‌ ఇచ్చాయి. డెవలప్‌‌మెంట్‌‌ ఫైనాన్స్‌‌ ఇన్‌‌స్టిట్యూషన్‌‌ ఏర్పాటు చేయడం వలన భవిష్యత్‌‌లో క్యాపిటల్‌‌ ఎక్స్‌‌పెండిచర్‌‌‌‌ పెరుగుతుంది. -క్రిష్ణ కుమార్‌‌‌‌ కర్వా, ఎమ్కే గ్లోబల్‌‌ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌ ఎండీ.

హెల్త్‌‌కేర్, ఇన్‌‌ఫ్రా, ఫైనాన్షియల్ సెక్టార్‌ లపైనే ఈ బడ్జెట్‌ ప్రధానంగా దృష్టిపెట్టింది. డిజిన్వెస్ట్‌‌మెంట్‌ , మానిటైజేషన్‌‌, ఇన్సూరెన్స్‌ సెక్టార్‌ లో ఎఫ్‌ డీఐల లిమిట్‌ ను పెంచడం, ఎన్‌‌పీఏలను తగ్గించే చర్యలు వంటి నెక్స్ట్‌ జనరేషన్ రీ ఫార్మ్స్‌ తో గ్రోత్‌ కోసం తీసుకొచ్చిన బడ్జెట్ ఇది.-ఉదయ్ కోటక్‌‌, కోటక్ మహింద్రా బ్యాంక్‌‌ ఎండీ.

మినిమం గవర్నమెంట్.. మ్యాగ్జిమం గవర్నెన్స్ 

నేషనల్​ నర్సింగ్ బిల్లును త్వరలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

కాంట్రాక్టులకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి ప్రత్యేక మెకానిజంను అందుబాటులోకి తేవడం.

జనాభా లెక్కలను తొలిసారిగా పూర్తి డిజిటల్​ పద్ధతిలో చేపట్టడం.

2021–22 కోసం రూ.3,768 కోట్ల కేటాయింపు.
పోర్చుగీస్​ పాలన నుంచి స్వాతంత్ర్యం పొంది స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడిన గోవా డైమండ్​ జూబ్లీ వేడుకల కోసం రూ.300 కోట్ల కేటాయింపు.
అస్సాం, వెస్ట్​ బెంగాల్​లోని టీ వర్కర్లు.. ముఖ్యంగా మహిళలు, వారి పిల్లల సంక్షేమం కోసం రూ.1,000 కోట్ల కేటాయింపు.

డీఎఫ్‌ఐ ఏర్పాటు, ఎన్‌‌పీఏలను డీల్‌ చేసేందుకు అసెట్‌ రీ కన్‌‌స్ట్రక్షన్‌‌ కంపెనీలను ఏర్పాటు చేయడం ఆహ్వానించదగ్గది. ట్యాక్స్ అసెస్‌ మెంట్లను తిరిగి ఓపెన్‌‌ చేయడాన్ని పరిమితం చేయడం, ఫేస్‌ లెస్‌ (కనిపించని) ఇన్‌‌కమ్‌ ట్యాక్స్ అప్పిలెట్‌ ట్రెబ్యునల్‌ను ఏర్పాటు చేయడం వంటి చర్యల వలన నిజాయితీగా ట్యాక్స్‌ కట్టే వాళ్లకు ప్రోత్సాహం లభిస్తుంది. అలానే అనేక రెగ్యు లేషన్లను, చట్టాలను సింగిల్ సెక్యూరిటీ కోడ్‌ కిందకు తేవడం పాజిటివ్‌ చర్య. -సుభ్రకాంత్‌ పాండా, ఫిక్కీ వైస్‌ ప్రెసిడెంట్.
ట్రావెల్‌ , టూరిజం ఇండస్ట్రీలకు సపోర్ట్‌‌ ఇచ్చే తక్షణ చర్యలు బడ్జెట్‌ లో లేకపోవడం నిరుత్సాహపరిచింది. ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం కేటాయింపులు పెంచడం లాంగ్ టెర్మ్‌‌లో టూరిజం సెక్టార్‌ కు బూస్టప్‌ ఇవ్వొచ్చు. -నకుల్‌ ఆనంద్‌‌, ఇండియన్‌‌ టూరిజం & హాస్పిటాలిటీ అసోసియేషన్‌ చైర్మన్.

ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ ను పెంచడం, ముఖ్యంగా ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌ పై ఖర్చులను పెంచడంతో చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. అంతేకాకుండా ఎకానమీ వీ–ఆకారంలో రికవరీ అవ్వడానికి వీలుంటుంది. రైతుల ఆదాయాలను పెంచాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా బడ్జెట్‌ లో అగ్రికల్చర్, రూరల్‌
ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌ లపై కేటాయింపులు పెరిగాయి. ఇది ఎకానమీకి మంచిది. -సంజివ్‌ పూరి, ఐటీసీ చైర్మన్.

ఇవి కూడా చదవండి

స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్..తొలిరోజు అటెండెన్స్ 55%

ఏపీలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

3.79 కేజీల బంగారం.. 435 క్యారెట్ల వజ్రాల స్మగ్లింగ్

‌‌