తల్లీకూతుళ్ల అత్యాచార కేసు నిందితుడు మృతి

తల్లీకూతుళ్ల అత్యాచార కేసు నిందితుడు మృతి

బులంద్‌షహర్‌లో 2016లో ఢిల్లీ-కాన్పూర్ రహదారిపై తల్లీకూతుళ్లపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడైన సలీం బవేరియా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ ఆదివారం మృతిచెందాడు. ఈ మధ్యే డయాలసిస్ చేయించుకున్న బవేరియా ఆరోగ్యం ఆదివారం తెల్లవారుజామున మరింత క్షీణించింది. పోలీసులు వెంటనే సలీంను జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.

బులంద్‌షహర్‌ ఘటన జూలై 29, 2016న జరిగింది. ఆ రోజు రాత్రి ఢిల్లీ-కాన్పూర్ రహదారిపై ఆరుగురు సభ్యులన్న ఓ కుటుంబం కారులో ప్రయాణిస్తున్నది. అది గమనించిన బవేరియా ముఠా వారి వాహనాన్నిఆపి.. పురుషులను తాళ్లతో కట్టేసి.. బాలిక మరియు ఆమె తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముఠాలోని ముగ్గురు సభ్యులను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఈ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. సలీం బవేరియా, జుబైర్ మరియు సాజిద్ అనే ముగ్గురు నిందితులపై కేసు నమోదయింది. వీరందరూ బులంద్‌షహర్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. సలీం చనిపోగా మిగతా దోషులైన జుబైర్, సాజిద్‌లు ప్రస్తుతం బులంద్‌షహర్ జైలులోనే ఉన్నారు.