‘ఫ్యామిలీ మ్యాన్ సీజన్‌‌ 3’లో విజయ్ సేతుపతి?

‘ఫ్యామిలీ మ్యాన్ సీజన్‌‌ 3’లో విజయ్ సేతుపతి?

కొడంబాక్కం: ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌కు ఓటీటీలో విశేష ఆదరణ దక్కుతోంది. తొలి సిరీస్‌కు మించి రెండో సీజన్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సిరీస్‌కు కొనసాగింపుగా మూడో సీజన్ కూడా రానుంది. అయితే ఈ సీజన్‌కు మరింత పాపులారిటీని తీసుకొచ్చేందుకు దర్శకద్వయం రాజ్ అండ్ డీకే కొత్త ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. రెండో సీజన్‌లో టాలీవుడ్ బ్యూటీ సమంతను ప్రధాన పాత్రలో నటింపజేసి మంచి బజ్ క్రియేటి చేశారు రాజ్ అండ్ డీకే. ఇప్పుడు మూడో సీజన్ కోసం ఏకంగా సౌత్ స్టార్ హీరో, ఫ్యాన్స్ మక్కల్ సెల్వన్‌గా పిల్చుకునే విజయ్ సేతుపతిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రెండో సీజన్‌లోనే విజయ్ నటించాల్సిందని, అయితే అనివార్య కారణాల వల్ల ఇది కుదరలేదని కొడంబాక్కం న్యూస్. త్వరలోనే బాలీవుడ్‌లోకి అడుగు పెట్టనున్న విజయ్ సేతుపతి.. ఒకవేళ ఫ్యామిలీ మ్యాన్‌లో నటిస్తే మాత్రం మరింత క్రేజ్ దక్కించుకోవడం ఖాయం. ఇకపోతే, ఫ్యామిలీ మ్యాన్ సీజన్‌ 3 చైనా కుట్ర నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. లాక్‌డౌన్ ముగిసిన వెంటనే ఈ సీజన్‌‌ను పట్టాలెక్కించేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.