Byjus Layoffs: ఫ్రెషర్లందరినీ తొలగించిన బైజూస్

Byjus Layoffs: ఫ్రెషర్లందరినీ తొలగించిన బైజూస్

టెక్ పరిశ్రమలో ఉద్యోగులను తొలగించే ప్రక్రియ జరుగుతోంది. ఎప్పుడు ఏ కంపెనీ లేఆఫ్ లను ప్రకటిస్తుందో అన్న భయాలు ఉద్యోగుల్లో నెలకొన్నాయి. ఈ క్రమంలో ఎడ్యుటెక్ యునికార్న్ బైజూస్1,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటిచింది. వీళ్లలో 15 శాతంమంది ఇంజినీరింగ్ విభాగంలో ఉన్నారు. డిజైన్, ఇంజినీరింగ్, ప్రొడక్షన్ ఇలా ప్రతి టెక్ టీమ్ లో ఉద్యోగులను తొలగించారని, ఇంజినీరింగ్ టీమ్ లలో 15 శాతంమందిని తొలగించారని బైజూస్ లోని ఇంజినీరింగ్ టీమ్ లో పనిచేస్తున్న ఒక ఉద్యోని తెలిపింది. తాజా రౌండ్ లేఆఫ్ లో ఫ్రెషర్లందరినీ కంపెనీ తీసేసిందని ఆమె వివరించారు. 

పెరుగుతున్న నష్టాలను, ఖర్చులను తగ్గించుకోవడానికి అన్ని డిపార్ట్మెంట్లలో దాదాపు 2,500 మంది ఉద్యోగులను తొలగిస్తామని బైజూస్ పోయిన ఏడాది జూన్ లోనే తెలిపింది. తప్పని పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని కంపెనీ సీఈఓ రవీంద్రన్ తెలిపారు.