న్యూఢిల్లీ: యూనికార్న్ స్టార్టప్‌లు ఎక్కువగా ఉన్న దేశాల్లో మూడో ప్లేస్‌లో కొనసాగుతున్న ఇండియా నుంచి గ్లోబల్ స్టార్టప్‌లతో పోటీ పడేవి చాలా తక్కువే ఉన్నాయి. యూనికార్న్ అంటే స్టార్టప్ వాల్యుయేషన్ ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉండడం. హురున్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం, గ్లోబల్‌గా టాప్ 100 యూనికార్న్‌ల లిస్టులో ఇండియా నుంచి ఐదు స్టార్టప్‌లు చోటు దక్కించుకున్నాయి. ఎడ్టెక్ కంపెనీ బైజూస్ 22 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో ఇండియాలోనే అత్యంత విలువైన యూనికార్న్‌గా నిలిచింది. గ్లోబల్ లిస్టులో 14 వ స్థానం దక్కించుకుంది. ఇంకా టాప్ 20 యూనికార్న్‌లలో ఎడ్టెక్ సెక్టార్ నుంచి ఉన్నది బైజూస్ మాత్రమే. 8 బిలియన్ డాలర్లతో ఫాంటసీ గేమింగ్ కంపెనీ డ్రీమ్11, ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీలు 84 వ ప్లేస్‌ను పంచుకున్నాయి. టాప్ 100 లిస్టులో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క గేమింగ్ కంపెనీ డ్రీమ్11 కావడం విశేషం. ఓలా వాల్యుయేషన్ 7.5 బిలియన్ డాలర్లుగా ఉండగా, హురున్ యూనికార్న్ లిస్టులో కంపెనీ ర్యాంక్ 94 గా నమోదయ్యింది. ఫిన్‌టెక్ కంపెనీ రేజర్‌పే కూడా 7.5 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో 94 వ ప్లేస్‌లో ఉంది. ఈ కంపెనీ ర్యాంక్ ఏడాది ప్రాతిపదికన 136 స్థానాలు ఎగబాకింది.
మొత్తం 1,361 యూనికార్న్‌లు..
గ్లోబల్‌గా 48 దేశాల నుంచి 1,361 యూనికార్న్ కంపెనీలు ఉన్నాయని హురున్ పేర్కొంది. వీటి మొత్తం విలువ 4.3 ట్రిలియన్ డాలర్లని తెలిపింది. ఇది ఏడాది ప్రాతిపదికన 17 శాతం పెరుగుదలకు సమానం. 2000 వ సంవత్సరం తర్వాత ఏర్పాటైన, వాల్యుయేషన్ ఒక బిలియన్ డాలర్ కంటే ఎక్కువగా ఉన్న స్టార్టప్‌లను ‘హురున్ గ్లోబల్ యూనికార్న్ లిస్ట్ – 2023’ కోసం పరిగణనలోకి తీసుకున్నారు. ఈ మొత్తం యూనికార్న్‌లలో 666 ఒక్క యూఎస్ నుంచే ఉన్నాయి. ఏడాది ప్రాతిపదికన 179 కొత్త యూనికార్న్‌లు ఈ దేశంలో పుట్టుకొచ్చాయి. 316 యూనికార్న్‌లతో తర్వాత ప్లేస్‌లో చైనా, 68 యూనికార్న్‌లతో మూడో ప్లేస్‌లో ఇండియా ఉన్నాయి. ఇండియన్స్ ఏర్పాటు చేసిన, దేశానికి వెలుపల హెడ్ క్వార్టర్లు ఉన్న యూనికార్న్‌లు మరో 70 ఉన్నాయి. వీటిలో ఎక్కువ యూఎస్, యూకేలోనే ఉన్నాయి. గ్లోబల్ యూనికార్న్ లిస్టులో టాప్ పొజిషన్లో టిక్‌టాక్ పేరెంట్ కంపెనీ బైట్‌డ్యాన్స్ కొనసాగుతోంది. ఈ కంపెనీ వాల్యుయేషన్ 200 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ 137 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో రెండో ప్లేస్‌లో, 120 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో యాంట్ గ్రూప్ మూడో ప్లేస్‌లో ఉన్నాయి. తాజా సంచలనం చాట్‌జీపీటీ 20 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో 272 ర్యాంక్‌లు మెరుగుపడి 17 వ స్థానానికి చేరుకుంది.