భారతీయులు చేస్తున్న అతిపెద్ద ఆర్థిక తప్పులు.. ఆవిరైపోతున్న సంపదను ఆపండిలా..

భారతీయులు చేస్తున్న అతిపెద్ద ఆర్థిక తప్పులు.. ఆవిరైపోతున్న సంపదను ఆపండిలా..

భారత్‌లోని ప్రజలు పెద్ద మొత్తంలో సంపాదనను కలిగి ఉన్నప్పటికీ.. సంపద పెంచుకోలేకపోతున్నారనే విషయాన్ని సీఏ నితిన్ కౌశిక్ హైలైట్ చేస్తున్నారు‌. మనలో చాలా మంది పెట్టుబడి విషయానికి వచ్చినప్పుడు.. “ఇన్వెస్ట్‌మెంట్‌‌ని వచ్చే నెల మొదలుపెడదాం” అనే ఆలోచనాతీరు కలిగి ఉండటం వల్ల భారీగా నష్టపోతున్నట్లు కౌశిక్ స్పష్టం చేశారు‌. దీనివల్ల మనమే మన సంపద పెంచుకునే అవకాశాన్ని మరచిపోతున్నామని.. ఇది భారతదేశంలో ప్రజలు చేస్తున్న అతిపెద్ద ‘ఆర్థిక మోసం’గా చార్టెడ్ అకౌంటెంట్ అభిప్రాయపడ్డారు. ​

చిన్న మొత్తాల్లో అయినా పెట్టుబడి చేయడాన్ని ఆలస్యం చేయడం వల్ల.. కాంపౌండింగ్ శక్తిని కోల్పోయిపోతున్నామన్న విషయాన్ని నితిన్ తెలియజేశారు‌. ఆలస్యం చేసే ప్రతి మాసానికీ.. దశాబ్దాల వరకు భారీ నష్టాలకు దారితీయెుచ్చన్నారు. అందుకే మంచి ఆదాయం ఉన్నా.. డిసిప్లిన్ లేకపోతే సంపద పెరగదని గుర్తుచేశారు. ఉదాహరణకు ఒక వ్యక్తి నెలకు రూ.50వేలు సంపాదిస్తూ.. ప్రతి నెల రూ.5వేలు పెట్టుబడి చేస్తే, నెలకు రూ.2లక్షలు సంపాదించి మొత్తాన్ని ఖర్చు చేస్తే వ్యక్తి కంటే ధనవంతుడు అవుతారని నితిన్ కౌశిక్ వివరించారు‌.​అంటే డబ్బు సరిగ్గా ఇన్వెస్ట్ చేసినవారే ధనవంతులుగా మారతారు కేవలం సంపాదించినవారు కాదు. 

ప్రస్తుతం సంపదను పెంచుకోవాలంటే కొంచెం SIPలు, రికరింగ్ డిపాజిట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఆదాయ మార్గాల్లో డబ్బు ఇన్వెస్ట్ చేయటం అలవాటు చేసుకోవడం మంచి పద్ధతి‌. ఆలస్యం చేయకుండా పెట్టుబడి చేసే అలవాటు పెరగాలి‌.​అందుకే “ఇన్‌కమ్ అదుర్స్ కానీ డిసిప్లిన్‌ మాత్రమే సంపదను పెంచుతుంది” అని కౌశిక్ యువతకు సూచిస్తున్నారు. అందుకే డబ్బు దాచుకునే విషయంలో ఎల్లప్పుడూ ఆలస్యానికి తావు ఇవ్వకూడదని సీఏ నేటి తరానికి సూచిస్తున్నారు. 

►ALSO READ | వొడఫోన్ ఐడియాకు సుప్రీం కోర్టులో ఊరట.. ఏజీఆర్ బకాయిలపై తీర్పుతో ఇన్వెస్టర్లలో జోష్..