CAA ప్రమాదకరం..దొంగతనం,రేప్లు పెరుగుతాయి :ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

CAA ప్రమాదకరం..దొంగతనం,రేప్లు పెరుగుతాయి :ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన CAA చట్టాన్ని వ్యతిరేకించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. బుధవారం (మార్చి 13)న ఇండియా కూటమి నేతలో కలిసి నిరసన వ్యక్తం చేశారు. CAA చాలా ప్రమాదకరమైనదని..శాంతిభద్రతలు దెబ్బతింటాయని..దొంగతనాలు, దోపిడీలు,అత్యాచారాలు పెరుగుతాయనిఅన్నారు. పాకిస్థాన్,బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మైనార్టీలకు పౌరసత్వం ఇవ్వబడుతుందని CAA లో వ్రాయబడిందన్నారు. ఇండియా పేద దేశం.. స్వాతంత్య్రానంతరం కంటే సీఏఏ  చట్టం వల్ల వలసలు ఎక్కువ కానున్నాయన్నారు కేజ్రీవాల్. 

మరోవైపు ఆప్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో జరిగిన అభివృద్ధి, మౌళిక వసతుల కల్పన గురించి సీఎం కేజ్రీవాల్ మాట్లాడారు. గత తొమ్మిదేళ్లలో  ఢిల్లీలో నీటి పైపులైన్లు గతంలో ఎన్నడూ వేయలేదన్నారు. ఆప్ ప్రభుత్వం వచ్చేనాటికి ఢిల్లీలో 4500 బస్సులు  ఉండేవని.. ఇప్పుడు 8వేల బస్సులున్నాయన్నారు. అందరికోసం పనిచేస్తున్నాం. ఆస్పత్రులు మెరుగుపర్చామన్నారు కేజ్రీవాల్. ఢిల్లీలోని ప్రతి గల్లీలో మొహల్లా క్లినిక్ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడు ప్రజలు ప్రైవేట్  ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు సీఎం కేజ్రీవాల్.