కాల్ ఫార్వార్డెడ్ స్కామ్ అంటే ఏందీ..?: మీ కాల్స్ ఫార్వార్డ్ అయితే ఎలా తెలుసుకోవాలి

కాల్ ఫార్వార్డెడ్ స్కామ్ అంటే ఏందీ..?: మీ కాల్స్ ఫార్వార్డ్ అయితే ఎలా తెలుసుకోవాలి

ఇటీవల కాలంలో కాల్ ఫార్వార్డెడ్ స్కామ్ గురించి మనం వింటున్నాం..కాల్ ఫార్వెర్డెడ్ స్కామ్ అనేది అటు ప్రభుత్వానికి, ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారింది. కాల్ ఫార్వార్డింగ్ ఫీచర్ ఉపయోగకరమైన ఫీచర్ అయినప్పటికీ ఇతర నంబర్లకు కాల్ మళ్లించడం ద్వారా ఇది దుర్వినియోగం అవుతోంది. మోసాలకు పాల్పడేందుకు ఫ్రాడ్స్టర్లు ఈ ఫీచర్ ని దుర్వినియోగం చేస్తున్నారు. దీంతో ఈ ఫీచర్ ను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఇందుకోసం మార్చి 2024లోనే డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సర్య్కూలర్ జారీ చేసింది.USSD ఆధారంగా అందించే కాల్ ఫార్వార్డింగ్ సేవలను నిలిపివే యాలని టెలికం కంపెనీలను ఆదేశించింది. ఆన్ లైన్ లో ఇతర వ్యక్తుల బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బును దొంగిలించడానికి ఫీచర్ ను స్కామర్లు దుర్వినియోగం చేస్తున్నందున కాల్ ఫార్వార్డింగ్ ఫీచర్ ను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 15 , 2024 నుంచి దేశవ్యాప్తంగా USSD ఆధారంగా పనిచేసే కాల్ ఫార్వార్డింగ్ సేవలు నిలిపివేయబడతాయి. 

ALSO READ :- GT vs PBKS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. మిల్లర్ స్థానంలో కేన్ మామ

స్కామర్లు ఇంటర్నెట్ ప్రొవైడర్లు లేదా టెలికా ఆపరేటర్లుగా నటిస్తూ కాల్ ఫార్వార్డింగ్ స్కామ్ ల ద్వారా మోసాలకు పాల్పడతారు. మీ మొబైల్ నంబర్లు హ్యాడ్ చేయబడిందని, సిమ్ కార్డులు బ్లాక్ అయ్యాయని చెప్పుతూ బాధితులను ఆందోళన గురి చేస్తారు. హ్యార్లు *401# వంటి USSD కోడ్ ని డయల్ చేయమని బాధితులను కోరతారు. పొరపాటున  ఈ కోడ్ డయల్ చేస్తే కాల్ ఫార్వార్డింగ్ జరుగుతుంది. ఇది బ్యాంక్ లావాదేవీలు జరిపే OTP ల వంటి షేర్ చేయబడతాయి. 

తమ కాల్స్ లేదా ఫోన్ నంబర్లు మరొక నంబర్ కు ఫార్వార్డ్ చేయబడిందా లేదా తెలుసుకోవాలంటే USSD *#21# ని ఉపయోగించవచ్చు. కాల్ ఫార్వార్డింగ్ స్కామ్ ల బారిన పడకుండా ఉండాలంటే.. టెల్కో కస్టమర్ సర్వీస్ నుంచి వచ్చే కాల్స్ మాత్రమే ఆన్సర్ చేయాలని డిపార్డ్ మెంట్ ఆప్ టెలికాం సూచిస్తోంది.