లారీ నిండా పండ్ల బుట్టలు.. తేడా కనిపిస్తోందని చెక్ చేస్తే..

లారీ నిండా పండ్ల బుట్టలు.. తేడా కనిపిస్తోందని చెక్ చేస్తే..

ఖమ్మం జిల్లా: సరుకులు రవాణా చేసే ఐషర్ లారీ.. లారీ నిండా పండ్ల బుట్టలున్నాయి.. డ్రైవర్ వద్ద వాహనం కాగితాలు చెక్ చేశారు. అన్నీ కరెక్టుగానే కనిపించడంతో  సరే వెళ్లిపోమని రైట్ చెప్పారు కూడా.. అయితే ముందున్న వాహనాలు క్లియర్ అయితే తప్ప ఇది కదిలే పరిస్థితి లేదు. దీంతో పోలీసులు ఒకసారి చూస్తే పోలా అంటూ లారీలో సరుకును ఎలా ఉందో చూద్దామనుకున్నారు. శాంపిల్ గా మధ్యలో ఉన్న బుట్టను కిందకు దింపారు. అడుగున రెండు కిలోల ప్యాకెట్ కనిపించింది. మరో బుట్ట చూస్తే.. అందులో కూడా అలాంటి ప్యాకెట్టే.. ఇదేంటని నిలదీస్తే డ్రైవర్ నీళ్లు నమిలాడు. దూరంలో ఆగి ఉన్న కారు వైపు చూస్తుండడంతో పండ్ల బుట్ట అడుగున ఉన్న ప్యాకెట్ విప్పి చూస్తే.. గంజాయి బయటపడింది. ఆదివారం సత్తుపల్లి పట్టణంలో వాహనాలు సోదా చేసిన పోలీసులు గంజాయి ప్యాకెట్లు చూసి ఖంగుతిన్నారు. దూరంలో ఆగి ఉన్న కారు.. ఈ సరుకుకు పైలట్ గా వస్తున్నట్లు గుర్తించారు. వీరంతా సరుకును తీసుకుని రాజమండ్రి నుండి వరంగల్ కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం ఐషర్ లారీ లోని పండ్ల బుట్టల మాటున గంజాయి ప్యాకెట్లు పెట్టి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తేలింది.   టీఎస్ 12 యూసీ 8612 నెంబరు గల ఐషర్లో లారీలో పండ్ల బుట్టల మాటున గంజాయి ప్యాకెట్లలో పెట్టి తరలిస్తున్నారు. గంజాయి సరుకు ఉన్న ఐషర్ లారీకి ఎస్కార్టుగా ఏపీ16 బీజెడ్ 1814 నెంబరు గల కారులో మరికొందరు వస్తున్నారు. గంజాయిని సీజ్ చేసిన సత్తుపల్లి పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

For More News..

ఇంజనీరింగ్ స్టూడెంట్లకు క్లాసుల్లేవ్.. ఓన్లీ ల్యాబులే

పీఆర్సీ రిపోర్ట్​ను లీక్​ చేసినోళ్లు దొరికిన్రు