
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మొబైల్ ఫోన్ల రిటైల్ సంస్థ సెల్‌బే వివిధ ఆఫర్లను ప్రకటించింది. రూ.15 వేల -కంటే ఎక్కువ విలువైన ప్రతి మొబైల్ కొనుగోలుపై రూ.2,499 - విలువైన ఇయర్ బడ్స్‌ను, రూ.15,000 - లోపు ప్రతి కొనుగోలుపై రూ.1,500 - విలువైన 10,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్‌ను ఫ్రీగా ఇస్తోంది.
రెడ్‌మీ, ఒప్పో, వివో, శామ్‌సంగ్ వంటి బ్రాండ్‌ల స్మార్ట్ ఫోన్ల పైనా క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తోంది. తమ దగ్గర జీరో డౌన్ పేమెంట్ ఫైనాన్స్ ఆప్షన్ అందుబాటులో ఉందని సెల్‌బే పేర్కొంది. ఐ ఫోన్ 13 కేవలం రూ.2,704, ఐ ఫోన్ 14 కేవలం రూ.3,121 - నెలవారి ఈఎంఐలో లభిస్తోందని వెల్లడించింది.
స్మార్ట్ టీవీలు రూ.7,999- నుంచి, స్మార్ట్ వాచ్‌లు రూ.799 -నుంచి, స్మార్ట్ కాలింగ్ వాచ్‌లు రూ.999 నుంచి తమ దగ్గర దొరుకుతాయని పేర్కొంది. బ్రాండెడ్ సౌండ్ బార్ కేవలం రూ.1299 కే లభిస్తుందని వివరించింది.
కొన్ని ప్రత్యేకమైన బ్రాండ్ మొబైల్స్‌ను ఎటువంటి సిబిల్ లేకుండానే ఫైనాన్స్ లో పొందొచ్చని అని సెల్‌బే ఫౌండర్ సోమ నాగరాజు పేర్కొన్నారు. అంతే కాకుండా, ఎన్నో రకాల మొబైల్ యాక్సెసరీస్ పైనా ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నామని చెప్పారు.