దేశంలోకి 11 రోజుల్లో 11 కరోనా వేరియంట్లు

దేశంలోకి 11 రోజుల్లో 11 కరోనా వేరియంట్లు

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 11 ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లను కేంద్రం గుర్తించింది. ఇవి డిసెంబరు 24  నుంచి- జనవరి 3 మధ్య విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులలో బయటపడినట్లు గురువారం వెల్లడించింది. 11 రోజుల్లో మొత్తం 19,227 మంది ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ కి కరోనా టెస్టులు చేయగా.. 124 మందిలో 11 సబ్‌ వేరియంట్లను గుర్తించామని తెలిపింది. 124 పాజిటివ్ శాంపిల్స్​లో 40 జీనోమ్ సీక్వెన్సింగ్ రిజల్ట్స్ వచ్చాయని.. అందులో ఎక్స్ బీబీ.1, ఎక్స్ బీబీ, బీఎఫ్7.4.1 ఉన్నట్లు వివరించింది.

ప్రస్తుతం బాధితులందరిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు చెప్పింది. కరోనాపై భయం అవసరం లేదని..అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ  కోరారు.