LICలో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు.. మహిళాలకు కూడా అవకాశం..

LICలో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు.. మహిళాలకు కూడా అవకాశం..

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ లైఫ్​ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్) అప్రెంటీస్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 22. 

పోస్టుల సంఖ్య: 192. తెలంగాణ రాష్ట్రంలో  20 ఖాళీలు ఉన్నాయి. హైదరాబాద్ 16, సికింద్రాబాద్ 02, కరీంనగర్ 01, మహబూబ్​నగర్​లో 01 ఉన్నాయి. 

ఎలిజిబిలిటీ: 2025, సెప్టెంబర్ 1 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2021, సెప్టెంబర్ 01 కంటే ముందు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు కాదు.  

వయోపరిమితి: 20 నుంచి 25 ఏండ్ల మధ్యలో ఉండాలి.

అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 02

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 22.

అప్లికేషన్ ఫీజు: పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.472. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.708. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.944.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 100 ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. 
బ్యాంకింగ్, ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్సూరెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, డిజిటల్/ కంప్యూటర్ లిటరసి, ఇంగ్లిష్​ నుంచి ప్రశ్నలు అడుగుతారు. 60 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.  

ఎగ్జామ్ డేట్: అక్టోబర్ 01. 

అప్రెంటీస్: 2025, నవంబర్ 1 నుంచి అప్రెంటీస్ ప్రారంభమవుతుంది. అప్రెంటీస్  కాలం 1 ఏడాది. నెలకు రూ.12,000 చొప్పున స్టైఫండ్ చెల్లిస్తారు.  

పూర్తి వివరాలకు cdn.lichousing.com  వెబ్​సైట్​లో సంప్రదించగలరు.