CSIR CLRIలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు.. బిటెక్ చదివినోళ్లు అప్లయ్ చేసుకోవచ్చు..

CSIR CLRIలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు.. బిటెక్ చదివినోళ్లు అప్లయ్ చేసుకోవచ్చు..


సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్ (CSIR CLRI) ప్రాజెక్ట్ అసోసియేట్ I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. 

ఎలిజిబిలిటీ: కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్​లో ఎంఎస్సీ లేదా లెదర్ టెక్నాలజీ/ఫుట్‌‌వేర్ టెక్నాలజీలో బి.టెక్ ఉత్తీర్ణులై ఉండాలి. లెదర్, టెక్స్​టైల్, లెదర్ డిజైన్, యాక్సెసరీస్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్‌‌లో బి.టెక్ లేదా బి.డి.ఎస్. లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు.  ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలకు 5 ఏండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ: డిసెంబర్ 11.

సెలెక్షన్ ప్రాసెస్: వాక్ ఇన్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు  clri.org వెబ్​సైట్​ను సందర్శించండి.