ఏపీ రాజధానిపై కేంద్రం క్లారిటీ 

ఏపీ రాజధానిపై కేంద్రం క్లారిటీ 

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అమరావతి ఏపీ రాజధాని అని స్పష్టం చేసింది. ఈ అంశంపై రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి అమరావతే ఏపీ రాజధాని అని చెప్పారు. రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్ఫష్టం చేశారు. 

మొదట ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమాచారం ఇచ్చిందని ఆ తర్వాత మూడు రాజధానులు అన్నారని నిత్యానంద రాయ్ చెప్పారు. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, జ్యుడీషియల్ క్యాపిటల్గా కర్నూలు, అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఏర్పాటు చేయనున్న విషయాన్ని తమ దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. అనంతరం ఆ బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయన్న మంత్రి.. ప్రస్తుతం తమ వద్దనున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని తేల్చిచెప్పారు. 

For more news..

జాతీయ రహదారిపై దర్జాగా రోడ్డు దాటుతున్న పులి

‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్ కన్ఫర్మ్