గ్రాడ్యుయేట్లలో తగ్గిన అన్ఎంప్లాయ్‌‌‌‌మెంట్‌‌‌‌

గ్రాడ్యుయేట్లలో తగ్గిన అన్ఎంప్లాయ్‌‌‌‌మెంట్‌‌‌‌

న్యూఢిల్లీ: గ్రాడ్యుయేట్లలో  నిరుద్యోగం తగ్గిందని ప్రభుత్వం పేర్కొంది. 15 ఏళ్ల వయసు కంటే పైనున్న  గ్రాడ్యుయేట్లలో  అన్‌‌‌‌ఎంప్లాయ్‌‌‌‌మెంట్ రేట్ 2022–23 లో 13.4 శాతానికి తగ్గిందని స్టాటిస్టిక్స్ మినిస్ట్రీ చేసిన పీరియాడిక్‌‌‌‌ లేబర్ ఫోర్స్ సర్వే పేర్కొంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో  ఈ నిరుద్యోగం రేటు 14.9 శాతంగా ఉంది. గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం  చండీగఢ్​లో తక్కువగా ఉంది.  

ఇక్కడ అన్‌‌‌‌ఎంప్లాయ్‌‌‌‌మెంట్ రేట్ 5.6 శాతంగా నమోదయ్యింది.  ఢిల్లీలో 5.7 శాతంగా  ఉంది. గ్రాడ్యుయేట్లలో అన్‌‌‌‌ఎంప్లాయ్‌‌‌‌మెంట్‌‌‌‌ అండమాన్‌‌‌‌ అండ్ నికోబార్‌‌‌‌‌‌‌‌ ఐలాండ్‌‌‌‌ (33 శాతం), లడఖ్‌‌‌‌ (26.5 శాతం), ఆంధ్రప్రదేశ్‌‌‌‌ (24 శాతం) లో  ఎక్కువగా ఉంది. రాజస్థాన్‌‌‌‌లో 23.1 శాతం, ఒడిస్సాలో 21.9 శాతంగా రికార్డయ్యింది. లేబర్ ఫోర్స్‌‌‌‌లో ఎంత మందికి ఉపాధి లేదనేది చూసి అన్‌‌‌‌ఎంప్లాయ్‌‌‌‌మెంట్ రేటును నిర్ణయిస్తారు. 

తాజాగా విడుదల చేసిన రిపోర్ట్ ఆరో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. జులై 2022 – జూన్ 2023 మధ్య శాంపిల్స్ తీసుకున్నామని,  మణిపూర్‌‌‌‌‌‌‌‌లో మాత్రం ఏప్రిల్‌‌‌‌ –జూన్ మధ్య ఫస్ట్ విజిట్‌‌‌‌, సెకెండ్ విజిట్‌‌‌‌ మరోసారి చేయాల్సి వచ్చిందని ప్రభుత్వం వెల్లడించింది.