కరోనా నిబంధనలు పాటించాలి

కరోనా నిబంధనలు పాటించాలి

కోవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో..కేంద్రం అప్రమత్తమైంది. భారత స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో కేసులు మరింత అధికమయ్యే అవకాశం ఉందని భావిస్తోంది. అందులో భాగంగా కోవిడ్ నియంత్రణ కోసం రాష్ట్రాలకు కొన్ని సూచనలు చేసింది. వేడుకల నేపథ్యంలో ప్రజలు పెద్దగా గుమికూడ ఉండకూడకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రతొక్కరూ సోషల్ డిస్టెన్స్ తో పాటు శానిటైజర్ వాడాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని వెల్లడించింది. 

పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికమౌతున్న సంగతి తెలిసిందే. దీంతో దేశంలో అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. కరోనా నిబంధనలు పాటించాలని రాష్ట్రాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు మాస్క్ లను కంపల్సరీ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో మాస్క్ ధరించని పక్షంలో ఫైన్ లు విధిస్తామని హెచ్చరించింది. రెండు సంవత్సరాల పాటు కోవిడ్ వైరస్ ఉండడంతో వేడుకలు ఘనంగా జరగలేదనే సంగతి తెలిసిందే. 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా.. 2022 స్వతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలు ప్లాన్ చేశాయి. మరోవైపు.. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 16 వేల 561 కరోనా కేసులు నమోదయ్యాయి. పాజిటివిటి రేటు 5.44గా ఉంది.