రైతు సంఘాలు తల్చుకుంటే ఉద్యమాన్ని ఆపొచ్చు

రైతు సంఘాలు తల్చుకుంటే ఉద్యమాన్ని ఆపొచ్చు

గ్వాలియర్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో రైతులు నిరసనలను కొనసాగిస్తున్నారు. వీటిని పరిష్కరించేందుకు రైతు సంఘాలతో కేంద్రం పలుమార్లు చర్చలు నిర్వహించినా ఈ సమస్య ఓ కొలిక్కి రాలేదు. దీంతో అన్నదాతలు తమ ఆందోళనలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పందించారు. రైతు సంఘాలు తల్చుకుంటే ఈ ఆందోళనలకు ముగింపు పలకొచ్చన్నారు. ‘ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ప్రభుత్వం ఏదో ఓ మార్గం కనుగొంటుంది. దీనిపై అన్నదాతలతో మళ్లీ చర్చించడానికి కేంద్రం సుముఖంగా ఉంది’ అని తోమర్ స్పష్టం చేశారు.