పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్... పొత్తుపై క్లారిటీ... 

పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్... పొత్తుపై క్లారిటీ... 

సుదీర్ఘకాలం పాటు ఉత్కంఠ రేపిన టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఎట్టకేలకు కుదిరింది. పవన్ కళ్యాణ్, చంద్రబాబులు ఢిల్లీలో మూడురోజుల పాటు పడిగాపులు కాసి మరీ బీజేపీతో డీల్ ఫిక్స్ చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 6 అసెంబ్లీ సీట్లు, 5ఎంపీ సీట్లు కేటాయించేందుకు డీల్ కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు టీడీపీ ముఖ్యనేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. నేతలకు బీజేపీతో పొత్తు ఆవశ్యకత గురించి వివరించిన ఆయన, ఈ పొత్తును ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను ముఖ్య నేతలకు అప్పగించారు.

ALSO READ :- 28 ఏళ్ల తరువాత ఇండియలో మిస్​ వరల్డ్​ పోటీలు

రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసమే ఈ పొత్తు అన్న బాబు, రాష్ట్రానికి మేలు జరిగేలా బీజేపీ నుండి త్వరలోనే ప్రకటన వస్తుందని అన్నారు. పొత్తు ఆవశ్యకత గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని నేతలకు మార్గదర్శకం చేసారు. బీజేపీతో పొత్తు, సీట్ల పంపకం కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఈ నెల 11న కూటమి రెండో జాబితా ప్రకటిస్తారని తెలుస్తోంది. రెండో జాబితా ప్రకటన తర్వాత 14న ఢిల్లీలో జరగబోయే ఎన్డీఏ పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొననున్నారు చంద్రబాబు.