
నలభై యేండ్లు దాటాక జుట్టు తెల్లబడడం కామనే. కానీ, ఈ జనరేషన్లో ఇరవై యేండ్లకే తెల్ల జుట్టు వచ్చేస్తోంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే..
ఒక కప్పు ఎండబెట్టిన ఉసిరి పొడిలో, రెండు కప్పులు పెరుగు కలపాలి. ఆ మిశ్రమాన్ని ఒక రాత్రంతా నానబెట్టి, తెల్లారి మాడుకు పట్టించాలి.
కొబ్బరినూనెలో కర్పూరం పొడిని కలపాలి. రాత్రి పడుకునే ముందు ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి ఐదునిమిషాలు మసాజ్ చేయాలి. మల్లె ఆకుల్ని నిమ్మరసంలో కలిపి గ్రైండ్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. కొబ్బరినూనెలో నిమ్మరసం కలుపుకుని ప్రతిరోజూ తలకు పట్టించాలి. పైన చెప్పినవన్నీ వారానికొకసారి క్రమం తప్పకుండా చేస్తే తెల్ల జుట్టు నల్లబడుతుంది.
ఇవి కూడా చదవండి: