
హైదరాబాద్: ఇండియా టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా తన 44వ డబుల్స్ టైటిల్‌ను కొద్దిలో చేజార్చుకుంది. డబ్ల్యూటీఏ చార్ల్స్టన్ ఓపెన్ టోర్నమెంట్ విమెన్స్ డబుల్స్‌లో ఆమె రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అమెరికాలోని సౌత్ కరోలినాలో ఆదివారం జరిగిన ఫైనల్లో సానియా (ఇండియా)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జోడీ 2–6, 6–4, 10–7తో నాలుగో సీడ్ అండ్రెజా క్లాపక్ (స్లొవేనియా) – మగ్డా లినెటె (పోలాండ్) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. మొదటి సెట్‌లో తేలిపోయిన సానియా ద్వయం వెంటనే పుంజుకుంది. నువ్వానేనా అన్నట్టు రెండో సెట్‌లో గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. సూపర్ టై బ్రైకర్లోనూ అద్భుతంగా పోరాడినప్పటికీ నెగ్గలేకపోయిన సానియా రన్నరప్‌తో తిరిగొచ్చింది.