చాట్ మెసేజ్​లని ఎడిట్ చేయొచ్చు

చాట్ మెసేజ్​లని ఎడిట్ చేయొచ్చు

కొత్త నెంబర్​ నుంచి ఎవరు ఫోన్ చేసినా వాళ్ల పేరు కనిపిస్తుంది ట్రూ కాలర్​లో. దాంతో ఎవరు ఫోన్ చేస్తున్నారనే విషయం తెలుస్తుంది. ముఖ్యంగా స్పామ్​ కాల్స్​ తలనొప్పి నుంచి బయటపడేందుకు ఈ ఫీచర్​ బాగా పనికొస్తుంది. దాంతో స్పామ్​ కాలింగ్ వార్నింగ్ యాప్స్​లో పాపులర్​ అయింది ట్రూ కాలర్. ఇప్పటివరకు కాల్​ డిటెక్షన్​ సర్వీస్ అందించిన ఈ యాప్​​  యూజర్ల సెక్యూరిటీ, కంఫర్ట్​ కోసం మరిన్ని కొత్త ఫీచర్లతో రాబోతోంది. వాటిలో స్మార్ట్ ఎస్సెమ్మెస్​​, కాల్​ రీజన్​, స్మార్ట్ రిమైండర్స్​ వంటివి ముఖ్యమైనవి.

కొన్నిసార్లు స్పామ్, ముఖ్యమైన మెసేజ్​లను వేరు చేయడం కష్టం. దీనికోసమే ‘స్మార్ట్ ఎస్సెమ్మెస్’ ఫీచర్ తెస్తోంది ట్రూ కాలర్. ఈ ఫీచర్​ ఎనేబుల్​ చేసుకుంటే... ఆటోమెటిక్​గా  ప్రమోషనల్, స్పామ్, డెలివరీస్, పేమెంట్స్​, ఇంపార్టెంట్​... అనే కేటగిరీలుగా మెసేజ్​లు విడిపోతాయి. దాంతో ముఖ్యమైన మెసేజ్​లను గుర్తించడం చాలా ఈజీ. ఆన్​లైన్​ మోసాల బారిన పడకుండా జాగ్రత్తపడొచ్చు. 

అర్జెంట్ మెసేజెస్​

ఏదైనా చెప్పాలనుకున్న ప్రతిసారి ఫోన్​ చేయాల్సిన అవసరం లేకుండా మెసేజ్​ పంపుతాం. ట్రూ కాలర్ తెస్తోన్న ‘అర్జెంట్ మెసేజెస్’  ఫీచర్ కూడా అలాంటిదే. ఇందులో  ఫ్లాష్​ మెసేజ్​లు యూజర్ల ఫోన్ స్క్రీన్ మీద పెద్ద అక్షరాల్లో పాప్​ అప్ అవుతాయి. అవతలివాళ్లు మెసేజ్​ చదివేవరకు అవి అలానే ఉంటాయి. ముఖ్యమైన విషయాలు పంపడానికి ఈ ఫీచర్​ చాలా ఉపయోగపడుతుంది. అర్జెంట్​ మెసేజ్​లు అవతలివాళ్లకు నోటిఫికేషన్లుగా కనిపిస్తాయి.  

చాట్ మెసేజ్​లని ఎడిట్ చేయొచ్చు

ఆటోకరెక్ట్ ఆప్షన్​  ఉండడం వల్ల మెసేజ్ టైప్​ చేసేటప్పుడు కొన్నిసార్లు ఒక పదం బదులు మరొక పదం వస్తుంది. దాంతో అనుకున్న పదం కాకుండా వేరొక పదం వెళ్తుంది. దాంతో ఆ మెసేజ్​ని డిలీట్ చేసి, మళ్లీ మెసేజ్​ పంపాల్సి వస్తుంది. ఈ సమస్య రాకుండా యూజర్ల కోసం సెంట్​ మెసేజ్​లను ఎడిట్​ చేసే​ ఫీచర్​ తీసుకొస్తోంది ట్రూ కాలర్. దీంతో  పంపిన మెసేజ్​లను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎడిట్ చేయొచ్చు. 

100 ఎంబీ ఫైల్స్ పంపొచ్చు

ట్రా కాలర్​ ద్వారా కూడా ఇకమీదట ఫైల్స్​ షేర్​ చేయొచ్చు. అయితే పెద్ద సైజ్​వి కాకుండా100 ఎంబీ సైజ్ ఉన్న  ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్​ పంపొచ్చు. 

పాస్​వర్డ్ ప్రొటెక్ట్ మెసేజ్​

మెసేజ్​లకి పాస్​కోడ్ లాక్​ ఉంటే మరింత సెక్యూరిటీ. అందుకోసం యూజర్లు 4 అంకెల పిన్​ సెట్​ చేసుకోవాలి. దీంతోపాటు బయోమెట్రిక్​ లాక్​ కూడా ఇస్తోంది ట్రూ కాలర్​. 

కాల్ రీజన్

కొన్నిసార్లు ముఖ్యమైనవాళ్లకు అర్జెంట్​గా ఫోన్​ చేయాల్సి వస్తుంది. కానీ, సరిగ్గా అదే టైంలో అవతలివాళ్ల ఫోన్​ బిజీ వస్తుంది. అలాంటప్పుడు  ‘కాల్​ రీజన్’ ఫీచర్​ ఉంటే...  ఏ విషయం గురించి ఫోన్​ చేశారనేది అవతలివాళ్లకు మెసేజ్​గా వెళ్తుంది.​ 

స్పామ్ బ్లాకింగ్

రోబో కాల్స్​, టెలిమార్కెటర్స్, స్కామ్స్, ఫ్రాడ్ కాల్స్​ని ఆటోమెటిక్​గా గుర్తించడమే కాకుండా వాటిని బ్లాక్​ చేస్తుంది. బ్యాక్​గ్రౌండ్​లో పనిచేస్తూ తెలిసిన స్పామర్స్​ నుంచి వచ్చే ఇన్​కమింగ్ కాల్స్, ఎస్సెమ్మెస్​​లని పసిగడుతుంది. 

స్మార్ట్ రిమైండ్స్ 

చాలా యూపిఐ పేమెంట్ యాప్స్​లో స్మార్ట్ రిమైండ్స్​ ఫీచర్​ అందుబాటులో​ ఉంటుంది. ట్రూ కాలర్​లో కూడా ఈ ఫీచర్ రానుంది. దీంతో కరెంట్ బిల్, పాలసీల వంటివి కట్టడానికి.. ఎన్ని రోజుల టైం ఉంది? మొబైల్ రీఛార్జ్​ ముగిసే రోజుతో పాటు పెండింగ్ బిల్స్​ అలర్ట్స్​ వస్తాయి. 

ట్విట్టర్​ సర్కిల్ వస్తోంది

ట్విట్టర్​ యూజర్లకు గుడ్​న్యూస్​. త్వరలోనే ‘ట్విట్టర్ సర్కిల్​’ అనే ఫీచర్​ రానుంది. ఇది ఇన్​స్టాగ్రామ్​లో ‘క్లోజ్​ ఫ్రెండ్’ ఫీచర్​ లాగ పనిచేస్తుంది. ఈ ఫీచర్​ వస్తే... కొన్ని ట్వీట్స్​ని కొందరితోనే షేర్​ చేసుకోనే వీలుంటుంది. అదెలాగంటే..  క్లోజ్​ ఫ్రెండ్స్​ లిస్ట్ క్రియేట్​ చేసుకోవచ్చు.  ట్విట్టర్ సర్కిల్​లో 150 మంది ఫ్రెండ్స్​తో ట్వీట్స్​ షేర్ చేసుకోవచ్చు. ఆ గ్రూప్​లోని వాళ్లతో షేర్​ చేసుకున్న ట్వీట్​ కింద ఆకుపచ్చని గీత కనిపిస్తుంది. టెస్టింగ్ స్టేజ్​లో ఉన్న  ఈ ఫీచర్​ని ఈ ఏడాది మే నెలలో కొంతమంది బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుంది. 

ట్వీట్స్​ని ఎడిట్ చేయొచ్చు

కొన్ని ట్వీట్స్​ వల్ల ట్రోలింగ్ బారినడపడతారు చాలామంది. అలాంటప్పుడు ‘ఎడిట్ ట్వీట్’ ఫీచర్​ ఉంటే ఆ ట్వీట్​ని సరిచేసుకునే ఛాన్స్ ఉంటుంది. యూజర్ల కంఫర్ట్​ కోసం ‘ఎడిట్​ ట్వీట్​’  ఫీచర్​ని టెస్ట్​ చేస్తోంది ట్విట్టర్​. ఈ ఫీచర్​  వస్తే... ఇంతకుముందు పోస్ట్ చేసిన ట్వీట్లను కూడా ఎడిట్ చేయొచ్చు. అయితే  ​ ‘ట్విట్టర్ బ్లూ’ సబ్​స్క్రిప్షన్​ తీసుకున్నవాళ్లకే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ట్వీట్​ని ముఫ్పై నిమిషాల్లోపు ఎడిట్​ చేయొచ్చు. చిన్న పొరపాటుని సరిచేయడానికి అంత టైం అక్కర్లేదు. కానీ, ఫలానా ట్వీట్ ఎందుకు చేయాల్సి వచ్చిందని వివరించడానికి లేదా ఆ ట్వీట్​ని కొత్తగా రాయడానికి  30 నిమిషాల టైం చాలా ఉపయోగపడుతుంది.