చైనాలో 6 నెలల తర్వాత తొలి కరోనా మరణం

చైనాలో 6 నెలల తర్వాత తొలి కరోనా మరణం

చైనాలో 6 నెలల తర్వాత మళ్లీ ఒక కరోనా మరణం చోటుచేసుకుంది. బీజింగ్​ నగరానికి చెందిన 87 ఏళ్ల వ్యక్తి  కొవిడ్​ ఇన్ఫెక్షన్​ తో బాధపడుతూ చనిపోయాడు.  అయితే మృతుడు కొవిడ్​ వ్యాక్సిన్​ తీసుకున్నాడా ? లేదా ? అనే దానిపై అధికార వర్గాలు స్పష్టత ఇవ్వలేదు. దీంతో చైనాలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,227కు చేరింది. చివరగా 2022 మే 26న చైనాలోని షాంఘైలో కరోనా మరణం సంభవించింది.  

చైనాలో దాదాపు 92 శాతం జనాభాకు ఇప్పటికే కొవిడ్​ వ్యాక్సినేషన్​ జరిగింది. ఇప్పటికీ చైనాలోని చాలా నగరాల్లో కఠిన లాక్​ డౌన్లు, క్వారంటైన్​ నిబంధనలను అమలు చేస్తున్నారు. మరోవైపు జీరో కొవిడ్​ విధానంతో చైనా ప్రజల్లో అసహనం తీవ్రరూపు దాలుస్తోంది.