జైషే ​ డిప్యూటీ చీఫ్ ను రక్షించేందుకు చైనా అడ్డుపుల్ల

జైషే ​ డిప్యూటీ చీఫ్ ను రక్షించేందుకు చైనా అడ్డుపుల్ల

న్యూఢిల్లీ: జైషే మహ్మద్​ డిప్యూటీ చీఫ్​ అబ్దుల్​ రవూఫ్​ అజార్​పై ఆంక్షలు విధించాలన్న ఇండియా, అమెరికా ప్రయత్నాలకు చైనా మోకాలడ్డింది. ఐక్యరాజ్య సమితి (యూఎన్​) వేదికగా ఆంక్షల కోసం కొన్నాళ్ల నుంచి ఇండియా, అమెరికా ప్రతిపాదనలు చేస్తున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు యూఎన్​ సెక్యూరిటీ కౌన్సిల్​లో  తాజాగా చైనా ప్రతిపాదన చేసింది. చైనా తీరును ఇండియా తీవ్రంగా తప్పుబట్టింది. ఇది ఆ దేశ ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడింది.

పాకిస్తాన్​ కు  చెందిన  జైషే మహ్మద్​ టెర్రరిస్ట్​ గ్రూప్​ చీఫ్​ మసూద్​ అజార్​ సోదరుడైన రవూఫ్​ అనేక టెర్రర్​ దాడుల్లో కీలక సూత్రధారి. 1999లో అఫ్గానిస్తాన్​లో ఇండియా విమానం హైజాక్ ​ఘటనలో రవూఫ్​ పాత్ర ఉంది. 2001లో పార్లమెంట్​పై దాడిలోనూ ప్రధాన నిందితుడు. 2016లో పఠాన్​కోట్​ ఐఏఎఫ్​ బేస్​ క్యాంప్​ పై జరిగిన టెర్రర్​ అటాక్​లోనూ నిందితుడే. పలు దేశాల్లోనూ రవూఫ్​పై కేసులు ఉన్నాయి. రవూఫ్​ను అంతర్జాతీయ టెర్రరిస్ట్​గా గుర్తించాలని, విదేశాల్లో పర్యటించకుండా నిషేధించాలంటూ యూఎన్​ సెక్యూరిటీ కౌన్సిల్​లో ఇండియా, అమెరికా కొన్నేండ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. సెక్యూరిటీ కౌన్సిల్​లో మొత్తం 15 దేశాలకు సభ్యత్వం ఉండగా.. 14 దేశాలు ఇండియా, అమెరికా ప్రయత్నాలకు మద్దతిస్తున్నాయి. చైనా మాత్రం అడ్డుపుల్లలు వేస్తున్నది. దీని వల్ల కౌన్సిల్​ నిర్ణయా నికి మరింత టైమ్​ పట్టే అవకాశం ఉంది.