మనం తిన్న ఆహారం గొంతులో ఇరుక్కుపోతే ఉక్కిరిబిక్కిరి అయిపోతాం. చిన్న పిల్లలైతే ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలున్నాయి. అలాంటిది ఓ యువతి తాను తిన్న చికెన్ లెగ్ పీస్ ను 14సంవత్సరాల పాటు ఊపిరి తిత్తుల్లోనే ఉంచుకుంది.
చైనా కు చెందిన ఓ యువతి(22) కొద్ది సంవత్సరాలుగా తీవ్రమైన దగ్గుతూ బాధపడుతోంది. ట్రీట్ మెంట్ కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగింది. అన్నీ టెస్ట్ లు చేసిన డాక్టర్లు సైతం.. ఎలాంటి అనారోగ్యం లేదు. ఆరోగ్యంగా ఉన్నారని చెబుతున్నారు. కానీ దగ్గుమాత్రం తగ్గడం లేదు. లాభం లేదనుకొని చివరిసారిగా గ్యాంగ్జూ యూనివర్శిటీ ఆఫ్ చైనీస్ మెడిసిన్ వైద్యుల్ని సంప్రదించింది. డాక్టర్లు అన్నీ టెస్ట్ లతో పాటు సిటీ స్కాన్ చేయించారు. సిటీ స్కాన్ చూసిన డాక్టర్లు కంగుతిన్నారు. ఎందుకంటే యువతి లంగ్స్ లో చికెన్ లెగ్ పీస్ ఉన్నట్లు గుర్తించారు. 14ఏళ్లుగా ఆ చికెన్ లెగ్ పీస్ లంగ్స్ లో ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం యువతికి ఆపరేషన్ చేసి ఊపిరితిత్తుల్లో ఉన్న చికెన్ లెగ్ పీస్ ను బయటకు తీశారు.
ఈ సందర్భంగా యువతి మాట్లాడుతూ తాను ఏడేళ్ల వయస్సులో ఉన్నప్పుడు చికెన్ లెగ్ పీస్ మింగినట్లు చెప్పింది. ఎలాంటి సమస్య లేకపోవడంతో పట్టించుకోలేదని చెప్పింది.
