ముగ్గురు  పిల్లల్ని కనొచ్చు

ముగ్గురు  పిల్లల్ని కనొచ్చు
  • త్రీ చైల్డ్ పాలసీకి చైనా గ్రీన్ సిగ్నల్

బీజింగ్: ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీలో చైనా ప్రభుత్వం మార్పులు చేసింది. ఇకపై దంపతులు ముగ్గురు పిల్లలను కనొచ్చని చెప్పింది. జననాల రేటు తగ్గిపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మునుపెన్నడూ లేని స్థాయిలో జననాల రేటు నెమ్మదించిందని, 60 ఏండ్లు పైబడినోళ్ల సంఖ్య పెరిగిందని జనాభా లెక్కల్లో తేలడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చైనా వెల్లడించింది. చైనాలో 2000– 2010 మధ్య జనాభా వృద్ధి రేటు అత్యంత తక్కువగా 0.57 శాతం నమోదైంది. దీంతో 2016లో ఇద్దరు పిల్లలను కనొచ్చంటూ చైనా సర్కారు కొత్త రూల్ తెచ్చింది. తాజా జనాభా లెక్కల ప్రకారం గత పదేండ్లలో జనాభా వృద్ధి రేటు 0.53 శాతంగా నమోదైంది. ఆశించిన రిజల్ట్స్​రాకపోవడంతో ముగ్గురు పిల్లల పాలసీ తెచ్చింది.