తైవాన్‌ సమీపంలో చైనా యుద్ధ విన్యాసాలు

 తైవాన్‌ సమీపంలో చైనా యుద్ధ విన్యాసాలు

తైవాన్ ను చైనా భయడపెడుతోంది. ఆ దేశం చుట్టూ చైనా సైనిక విన్యాసాలు చేస్తోంది. ఎయిర్ ఫోర్స్, నేవీకి చెందిన డ్రాగన్ సైన్యం డ్రిల్స్ తో తైవాన్ ను భయపెడుతోంది. తైవాన్ ను ఆక్రమించుకోవాలన్న ఉద్దేశంతోనే ఆ దేశంసైనిక విన్యాసాలు చేపడుతోందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇటీవలే అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ లో పర్యటించారు. ఆ పర్యటనను చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో తైవాన్ పై చైనా తన సైనిక బలాన్ని ప్రదర్శిస్తోంది. 

డ్రిల్స్ తో, సైనిక చర్యలతో తమ దేశాన్ని ఆక్రమించాలని చైనా చూస్తోందని తైవాన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ వూ తెలిపారు. మిసైల్స్ ను లాంచ్ చేస్తున్నట్లు, సైబర్ దాడులు కూడా జరుపుతున్నట్లు తెలిపారు. తైవాన్ నిన్న అర్ధరాత్రి సుమారు గంటకు పైగా విన్యాసాలు చేపట్టినట్లు వివరించారు. మరోవైపు చైనాలోని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఈస్ట్రన్‌ థియేటర్‌ కమాండ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము తైవాన్‌ సమీపంలో నిర్వహిస్తున్న యుద్ధ విన్యాసాల్లో జాయింట్‌ బ్లాకేడ్‌, జాయింట్‌ సపోర్ట్‌ కార్యకలాపాలపై దృష్టిపెట్టామని పేర్కొంది.

తైవాన్‌ కూడా నిన్న అర్ధరాత్రి సుమారు గంటకు పైగా యుద్ధ విన్యాసాలను చేపట్టింది. ఈ విషయాన్ని ఆ దేశ 8వ కోర్‌ ప్రతినిధి లూవీ-జై పేర్కొన్నారు. ఈ విన్యాసాల్లో తైవాన్‌ శతఘ్నులు, ఫ్లేయర్లను ప్రయోగించింది. మొత్తం 40 శతఘ్నులను ఇందుకోసం వాడింది. చైనా సోమవారం యుద్ధ విన్యాసాలను పొడిగించాక.. తైవాన్‌ యాంటీ ల్యాండింగ్‌ ఎక్సర్‌సైజ్‌లను నిర్వహించింది.