ఫస్ట్ ల్యాబ్ మాడ్యుల్​ను లాంఛ్ చేసిన డ్రాగన్​ కంట్రీ

ఫస్ట్ ల్యాబ్ మాడ్యుల్​ను లాంఛ్ చేసిన డ్రాగన్​ కంట్రీ

బీజింగ్ : నిర్మాణంలో ఉన్న తన స్పేస్​స్టేషన్ ​తియాంగాంగ్ ​కోసం ఫస్ట్​ల్యాబ్​ మాడ్యుల్​(ఇన్​స్ట్రుమెంట్ల సమూహం) వెంటియాన్​ను చైనా ఆదివారం విజయవంతంగా లాంచ్​ చేసింది. లాంగ్​మార్చ్​5బీవై3 క్యారియర్​ రాకెట్​ఈ మాడ్యుల్​ను స్పేస్​లోకి తీసుకెళ్లింది. దక్షిణ ఐలాండ్​ ప్రావిన్స్​ హైనన్ తీర ప్రాంతంలోని వెంచాంగ్​ స్పేస్​క్రాఫ్ట్​ సైట్​ నుంచి వెంటియాన్​ను వెంటపెట్టుకుని ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిందని చైనా మ్యాన్డ్​ స్పేస్​ ఏజెన్సీ (సీఎంఎస్​ఏ) తెలిపింది.‘‘ కోర్ ​మాడ్యులైన తియాన్హెకు ఈ వెంటియాన్​ మాడ్యుల్​ బ్యాకప్​ గాను, స్పేస్​ స్టేషన్​లో శక్తివంతమైన సైంటిఫిక్​ ఎక్స్ పెరిమెంట్​ప్లాట్ ఫాంగానూ పనిచేస్తుంది. మొదట్లో సింగిల్​ మాడ్యుల్​ స్ట్రక్చర్​గా ఉండే తియాంగాంగ్​తర్వాత తియాన్హె, వెంటియాన్​, మెంగ్టియాన్​ అనే మూడు మాడ్యుల్స్​లోకి విడిపోతుంది. వాటిలో తియాన్హె కోర్​ మాడ్యుల్​గా పనిచేస్తుంది” అని చైనా అధికారిక మీడియా పీపుల్స్​డైలీ (పీడీ) తెలిపింది. మరికొన్ని గంటల్లో 5బీవై3 క్యారియర్​ రాకెట్​ నుంచి వెంటియాన్ విడిపోయి తియాంగాంగ్​ స్పేస్​స్టేషన్​తో డాక్​(అనుసంధానం కావడం) అవుతుందని  సీఎంఎస్​ఏ పేర్కొంది. ఆ తర్వాత ముగ్గురు క్రూ మిషన్​కమాండర్లు ల్యాబ్ ​మాడ్యుల్​లోకి ప్రవేశించి, ఎక్విప్​మెంట్ల పనితీరును పరిశీలిస్తారని సీఎంఎస్​ఏ వెల్లడించింది. 

ఏంటీ తియాంగాంగ్​?
అంతరిక్షంలో చైనా నిర్మిస్తున్న స్పేస్​స్టేషనే తియాంగాంగ్. భూమికి 350 నుంచి 450 కిలోమీటర్ల మధ్యలో (లో ఎర్త్​ఆర్బిట్) ఈ స్పేస్​స్టేషన్​ను నిర్మిస్తున్నది. పనులు పూర్తయితే ప్రపంచంలోనే సొంతంగా ఒక స్పేస్​స్టేషన్ ను కలిగి ఉన్న దేశంగా చైనా రికార్డు సృష్టిస్తుంది.