మూడో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్​ను లాంచ్ చేసిన చైనా

మూడో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్​ను లాంచ్ చేసిన చైనా

బీజింగ్: మూడో ఎయిర్​క్రాఫ్ట్​ క్యారియర్​ను చైనా లాంచ్​ చేసింది. అత్యాధునికమైన, పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ నౌకను రూపొందించింది. ఇండో -పసిఫిక్​ రీజియన్​లో నేవీ సామర్థ్యాన్ని పెంచుకోవడంలో భాగంగా బీజింగ్​ ఈ ఎయిర్​క్రాఫ్ట్​ ​ క్యారియర్​ను అందుబాటులోకి తెచ్చింది. షాంఘై షిప్​యార్డ్​లో జరిగిన కార్యక్రమంలో ఫుజియాన్​ ఎయిర్​క్రాఫ్ట్​ క్యారియర్​ను అధికారులు లాంచ్​ చేశారు. వాస్తవానికి పీపుల్స్​ లిబరేషన్ ఆర్మీ నేవీ(పీఎల్ఏఎన్) 73వ వార్షికోత్సవంలో భాగంగా ఏప్రిల్​ 23న దీనిని లాంచ్ చేయాలె. కానీ కరోనా కారణంగా షాంఘైలో లాక్​డౌన్​ విధించడంతో రెండు నెలల పాటు ఇది వాయిదా పడింది. దీనిని చైనా స్టేట్​ షిప్​ బిల్డింగ్​ కార్పొరేషన్​ లిమిడెట్​ రూపొందించింది. ఇది 80 వేల టన్నుల బరువు ఉంటుంది. చైనా తూర్పు తీరంలోని ఫుజిన్​ ప్రావిన్స్​ పేరునే ఈ ఎయిర్​క్రాఫ్ట్​ క్యారియర్​కు పెట్టారు. చైనా మొదటి ఎయిర్​క్రాఫ్ట్​ క్యారియర్​ లియోనింగ్​ను 2012లో అందుబాటులోకి తెచ్చింది. రెండో ఎయిర్​ క్రాఫ్ట్​ క్యారియర్​ షాన్​డాంగ్​ను 2019లో లాంచ్​ చేసింది. ఫుజిన్​ మూడోది. వీటన్నింటిలోనూ అత్యాధునికమైనది. మొత్తంగా ఐదు ఎయిర్​క్రాఫ్ట్ క్యారియర్లను సిద్ధం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా తదుపరి ఎయిర్​క్రాఫ్ట్​ క్యారియర్​ను న్యూక్లియర్​ సామర్థ్యంతో సిద్ధం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.