చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు 

చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు 

కోవిడ్ అంతం అయిపోయిందనుకుని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో చైనా మరోసారి ప్రపంచానికి పిడుగులాంటి వార్త చెప్పింది. డ్రాగన్ కంట్రీలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది.గత రెండేళ్లలో ఎన్నడూలేని విధంగా ఒక్కరోజులో వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ చైనాలో దాదాపు 3 వేల 400 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యే హాట్ స్పాట్ లపై లాక్ డౌన్ ను విధిస్తున్నారు అధికారులు. కరోనా కారణంగా షాంఘైలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేశారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కొన్ని పట్టణాల్లో లాక్ డౌన్ విధించారు. జిలిన్ నగరంలో పాక్షిక లాక్ డౌన్  ప్రకటించారు. నార్త్ కొరియా సరిహద్దు ప్రాంతాలను పూర్తిగా మూసివేసింది చైనా.

మరిన్ని వార్తల కోసం

ప్రపంచమంతా ఉక్రెయిన్ వైపే.. అసలు చరిత్ర ఏంటి?

రెండో విడత బడ్జెట్‌‌ సమావేశాల్లో టైమింగ్స్ మార్పు