కరోనా వ్యాప్తికి ముందే వుహాన్‌‌‌‌‌‌‌‌ ల్యాబ్‌‌‌‌‌‌‌‌లో ముగ్గురికి అస్వస్థత

కరోనా వ్యాప్తికి ముందే వుహాన్‌‌‌‌‌‌‌‌ ల్యాబ్‌‌‌‌‌‌‌‌లో ముగ్గురికి అస్వస్థత

వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌:చైనాలోని వుహాన్‌‌‌‌‌‌‌‌ ల్యాబ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి మరో సంచలన వార్త బయటకు వచ్చింది. వుహాన్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ వైరాలజీ ల్యాబ్‌‌‌‌‌‌‌‌లో ముగ్గురు రీసెర్చర్లు 2019 నవంబర్‌‌‌‌‌‌‌‌లో అస్వస్థతకు గురయ్యారని అమెరికా ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ సంస్థల రిపోర్టుల ఆధారంగా వాల్‌‌‌‌‌‌‌‌ స్ట్రీట్‌‌‌‌‌‌‌‌ జర్నల్‌‌‌‌‌‌‌‌ ఎంతమంది రీసెర్చర్లు అనారోగ్యం పాలై, ఎప్పుడు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో చేరారు లాంటి వివరాలను వెల్లడించింది. బయటి ప్రపంచానికి కరోనా వ్యాపించడానికి ముందే వుహాన్‌‌‌‌‌‌‌‌ ల్యాబ్‌‌‌‌‌‌‌‌లోని  కొందరు జ్వరం, పొడిదగ్గు వంటి లక్షణాలతో ఇబ్బంది పడ్డారని,  వాళ్లు ఎందుకు అనారోగ్యం పాలయ్యారో మాత్రం కారణాలు లేవంది. కరోనా ఇన్వెస్టిగేషన్‌‌‌‌‌‌‌‌లో భాగంగా త్వరలో డబ్ల్యూహెచ్‌‌‌‌‌‌‌‌వో సమావేశం కానున్న టైమ్‌‌‌‌‌‌‌‌లో ఈ రిపోర్టు బయటకు రావడం చర్చనీయాంశమైంది.

వాల్​ స్ట్రీట్​ జర్నల్​ వార్తలు నిజం కావు: చైనా

వాల్‌‌‌‌‌‌‌‌ స్ట్రీట్‌‌‌‌‌‌‌‌ వార్తపై అమెరికా నేషనల్‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ స్పోక్స్‌‌‌‌‌‌‌‌ వుమెన్‌‌‌‌‌‌‌‌ కామెంట్‌‌‌‌‌‌‌‌ చేయలేదు. అయితే బైడెన్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం మాత్రం కరోనా పాండమిక్‌‌‌‌‌‌‌‌ తొలి రోజులు, చైనాలో వైరస్‌‌‌‌‌‌‌‌ వ్యాప్తికి సంబంధించి అనుమానాలున్నాయన్నారు. దీనిపై డబ్ల్యూహెచ్‌‌‌‌‌‌‌‌వో, ఇతర సంస్థలతో అమెరికా కలిసి పని చేస్తోందని తెలిపారు. వాల్‌‌‌‌‌‌‌‌ స్ట్రీట్‌‌‌‌‌‌‌‌ వార్తపై చైనా విదేశాంగ శాఖ స్పందిస్తూ, ల్యాబ్‌‌‌‌‌‌‌‌ నుంచి వైరస్‌‌‌‌‌‌‌‌ లీకయ్యే అవకాశమే లేదని డబ్ల్యూహెచ్‌‌‌‌‌‌‌‌వో చెప్పిందని, అమెరికా కావాలనే ల్యాబ్‌‌‌‌‌‌‌‌ లీక్‌‌‌‌‌‌‌‌ థియరీని హైప్‌‌‌‌‌‌‌‌ చేస్తోందని, వాల్​ స్ట్రీట్​ జర్నల్​ వార్తల్లో నిజం లేదంది. 

ఆ వివరాలివ్వని చైనా

కరోనా మొదలైన తొలినాళ్లలో దాని బారిన పడిన వాళ్ల వివరాలు ఇవ్వాలని చైనాను డబ్ల్యూహెచ్‌‌‌‌‌‌‌‌వో కోరింది. కానీ ఆ డేటాను ఇవ్వడానికి చైనా ఒప్పుకోలేదు. వుహాన్‌‌‌‌‌‌‌‌లోని బ్లడ్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ నమూనాలు ఇవ్వాలని.. వాటిల్లో 2019 డిసెంబర్‌‌‌‌‌‌‌‌ కంటే ముందు నమూనాలను పరిశీలిస్తామని డబ్ల్యూహెచ్‌‌‌‌‌‌‌‌వో కోరగా దానికీ చైనా నో చెప్పింది. ఆ తర్వాత ఇచ్చేందుకు అంగీకరించినా ఆ శాంపుల్స్‌‌‌‌‌‌‌‌ను పరిశీలించే ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌కు ఇంకా అవకాశం ఇవ్వలేదు.