చైనాలో ఓ వ్యక్తికి బర్డ్‌ ఫ్లూ.. ప్రపంచంలోనే తొలిసారి

చైనాలో ఓ వ్యక్తికి బర్డ్‌ ఫ్లూ.. ప్రపంచంలోనే తొలిసారి

బీజింగ్: కోళ్లు, పక్షులకు వ్యాపించే బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా సోకుతుందని ఇన్నాళ్లూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడీ వార్తలు నిజమయ్యాయి. కరోనా వైరస్‌‌కు పుట్టుకగా భావిస్తున్న చైనాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకింది. ఈ విషయాన్ని ఆ దేశ నేషనల్ హెల్త్ కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ వ్యక్తికి హెచ్‌10ఎన్‌3 (H10N3) స్ట్రెయిన్‌ సోకిందని వెల్లడించింది. తూర్పు ప్రావిన్స్‌లోని జెన్‌జియాంగ్‌ నగరానికి చెందిన 41 ఏళ్ల పురుషుడికి బర్డ్‌ ఫ్లూ సోకిందని జాతీయ ఆరోగ్య కమిషన్‌ వివరించింది. 

వారం కిందర సదరు వ్యక్తికి రక్త పరీక్షలు చేయగా అతడికి బర్డ్ ఫ్లూ సోకిందని ఫలితాల్లో నిర్ధారణ అయ్యిందని ఆరోగ్య కమిషన్ స్పష్టం చేసింది. అయితే కోళ్ల నుంచి ఆ వ్యక్తికి వైరస్ ఎలా సోకిందనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. కాగా, బర్డ్ ఫ్లూ కేసు గురించి తెలుసుకున్న చైనా వైద్యారోగ్య శాఖ వెంటనే అప్రమత్తమైంది. వైరస్ సోకిన పేషెంట్‌కు ప్రత్యేక చికిత్స అందిస్తోందని సమాచారం. అతడు ఎవరెవర్ని కలిశాడు తదితర వివరాలు సేకరించి వారిని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారని తెలిసింది.