చంద్రుడిపై దిగిన విదేశీ రోవర్

చంద్రుడిపై దిగిన విదేశీ రోవర్

చంద్రడి ఉపరితల నమూనాలను సేకరించడం కోసం చైనా పంపిన అంతరిక్ష నౌక మంగళవారం చంద్రుడి ఉపరితలం మీద విజయవంతంగా దిగింది. చైనా నవంబర్ 24న చాంగ్ -5 ప్రోబ్‌ను ప్రారంభించింది. ఇది చంద్రుని మీద మట్టి, రాళ్లు మొదలైన కొన్ని శాంపిల్స్‌ను తీసుకొస్తుంది. వీటితో చంద్రుని యొక్క మూలాలు తెలుసుకోవడం శాస్త్రవేత్తలకు మరింత సులవు అవుతుంది. మంగళవారం ల్యాండైన స్పేస్ క్రాఫ్ట్ రెండు రోజుల తర్వాత దాదాపు 2 కిలోల మట్టి నమూనాలను సేకరిస్తుంది. ల్యాండర్ తన రోబోటిక్ చేతితో భూమిలోకి రంధ్రం చేసి.. మట్టి మరియు రాతి నమూనాలను రిటర్న్ క్యాప్సూల్‌కు పంపిస్తుంది. మిషన్ పూర్తయిన తర్వాత ఈ స్పేస్ క్రాఫ్ట్ మంగోలియా ప్రాంతంలో ల్యాండింగ్ అవుతుంది. ప్రస్తుతం స్పేస్ క్రాఫ్ట్‌లో రోబోను పంపిన చైనా.. ఈ ప్రయోగం తర్వాత చైనా చంద్రుడి మీదకు మనిషిని పంపాలని ఆలోచిస్తుంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. అమెరికా మరియు సోవియట్ యూనియన్ దేశాల తర్వాత చంద్రడి నమూనాలను సేకరించిన మూడవ దేశంగా చైనా నిలుస్తుంది.