చైనాలో తెరుచుకుంటున్న రెస్టారెంట్లు

చైనాలో తెరుచుకుంటున్న రెస్టారెంట్లు
  • చైనాలో తెరుచుకుంటున్న రెస్టారెంట్లు
  • జనం ఆందోళనలతో దిగొచ్చిన జిన్​పింగ్​ సర్కారు
  • కరోనా ఆంక్షలను సడలిస్తున్న అధికారులు

బీజింగ్‌‌‌‌: చైనాలో ‘జీరో కొవిడ్‌‌‌‌’ పాలసీ ఎత్తేసేందుకు ఆ దేశ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇటీవల అక్కడ కేసులు భారీగా పెరుగుతుండటంతో జీరో కొవిడ్ పాలసీని కఠినంగా అమలు చేసేందుకు నిర్ణయించారు. అయితే, కొద్ది రోజులుగా కరోనా ఆంక్షలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం ఆంక్షలు సడలించాలని నిర్ణయించింది. ఒకవైపు కేసులు పెరుగుతున్నా వైరస్‌‌‌‌ ప్రభావం ఎక్కువగా లేకపోవడంతో మాస్‌‌‌‌ కరోనా టెస్టులు, క్వారంటైన్‌‌‌‌ రూల్స్‌‌‌‌లో సడలింపులు చేసినట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. దేశంలో వైరస్‌‌‌‌ క్రమంగా బలహీనపడుతోందని, ఈ వారంలో పలు జిల్లాల్లో లాక్‌‌‌‌డౌన్‌‌‌‌లను ఎత్తివేశామని నేషనల్‌‌‌‌ హెల్త్‌‌‌‌ కమిషన్‌‌‌‌ వైస్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ సన్‌‌‌‌ చున్‌‌‌‌లాల్‌‌‌‌ తెలిపారు.

బీజింగ్‌‌‌‌లో కొన్ని షాపింగ్‌‌‌‌ మాల్స్‌‌‌‌ గురువారం నుంచి తెరుచుకున్నాయి. ఈ సిటీలోని ఓ రెసిడెన్షియల్‌‌‌‌ కమ్యూనిటీలో ఎలాంటి సామాజిక కార్యకలాపాలు నిర్వహించడానికి వీల్లేదని, మాస్‌‌‌‌ టెస్టింగ్‌‌‌‌ కూడా అవసరంలేదని శుక్రవారం నోటీసులు ఇచ్చారు. బీజింగ్‌‌‌‌లోని చాలాచోట్ల వైరస్‌‌‌‌ టెస్టింగ్ సెంటర్లు మూతబడ్డాయి. టెస్టుల సంఖ్య 20–30 శాతానికి పడిపోయిందని స్థానిక హెల్త్‌‌‌‌ అధికారులు వెల్లడించారు. రెస్టారెంట్లు, కేఫ్‌‌‌‌లలో టేక్‌‌‌‌ అవే సర్వీసులను మాత్రమే కంటిన్యూ చేస్తున్నారు. గ్వాంగ్‌‌‌‌జౌలోని కొన్నిచోట్ల రెస్టారెంట్లలో డైన్‌‌‌‌ ఇన్‌‌‌‌ సర్వీసు ప్రారంభించారు. షెన్‌‌‌‌జెన్‌‌‌‌లో వైరస్‌‌‌‌ సోకిన వారు ఇంట్లో క్వారంటైన్‌‌‌‌ అయ్యేందుకు అనుమతించారు. చోంగింగ్‌‌‌‌లో బార్బర్‌‌‌‌‌‌‌‌ షాపుల నుంచి జిమ్‌‌‌‌ల వరకు చాలా బిజినెస్‌‌‌‌లు ఈ వారంలో స్టార్ట్‌‌‌‌ అయ్యాయి.