భారత విద్యార్థులకు చైనా అనుమతి

భారత విద్యార్థులకు చైనా అనుమతి

చైనాలో చదువుతూ కొవిడ్ 19 కారణంగా భారత్ తిరిగొచ్చి ఇక్కడే ఉండిపోయిన విద్యార్థులకు డ్రాగన్ కంట్రీ గుడ్ న్యూస్ చెప్పింది. వారిలో కొందరిని దేశంలోకి అనుమతించేందుకు చైనా విదేశాంగ శాఖ ఓకే చెప్పింది. ప్రస్తుతానికి కొన్ని షరతులతో కొందరికి మాత్రమే పర్మిషన్ ఇస్తామని స్పష్టం చేసింది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా చైనా కఠిన ఆంక్షలు అమలు చేస్తుండటంతో అక్కడ చదివే భారత విద్యార్థులు ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. చైనాలో చదువుకునే భారత విద్యార్థులకు ప్రాధాన్యమిస్తామని తాజాగా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ అంశంపై భారత్ కు కొన్ని మార్గదర్శకాలు సూచించారు. 

దాదాపు 23వేల మంది భారతీయ విద్యార్థులు చైనాలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. 2019లో చైనాలో కరోనా స్వైర విహారం చేయడంతో వారంతా స్వదేశానికి తిరిగొచ్చారు. చైనా ప్రభుత్వం తిరిగి వచ్చేందుకు అనుమతివ్వకపోవడంతో వారంతా ఇక్కడే ఉండిపోయారు.