గంటకు 600 కిలోమీటర్ల స్పీడ్‌.. పట్టాలకు టచ్‌ కాకుండా దూసుకెళ్లే ట్రైన్

గంటకు 600 కిలోమీటర్ల స్పీడ్‌.. పట్టాలకు టచ్‌ కాకుండా దూసుకెళ్లే ట్రైన్

బీజింగ్: ట్రాన్స్‌పోర్టేషన్‌లో కొత్త కొత్త టెక్నాలజీలు ఫాస్ట్‌గా వచ్చేస్తున్నాయి. ట్రైన్ల విషయంలో ఇప్పటి వరకు బుల్లెట్‌ ట్రైన్‌ మాత్రమే అత్యంత ఫాస్ట్‌.. హయ్యెస్ట్ స్పీడ్‌ వెళ్లే బుల్లెట్ ట్రైన్లు జపాన్‌లో ఉన్నాయి. ఇవి గంటకు  500 కిలోమీటర్ల టాప్‌ స్పీడ్‌తో ప్రయాణించగలవు. అయితే ఇప్పుడు చైనా కొత్తగా ‘మ్యాగ్‌లెవ్’ ట్రైన్‌ను ఆవిష్కరించింది. ఇది గంటలకు 600 కిలోమీటర్ల మ్యాగ్జిమం స్పీడ్‌తో ప్రయాణించగలదు. చైనాలోని కోస్టల్ సిటీ క్వింగ్డావోలో దీనిని తయారు చేసినట్లు ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది. ఈ ట్రైన్ చైనాలోని బీజింగ్‌ నుంచి షాంఘైకు వెయ్యి కిలో మీటర్ల దూరాన్ని రెండున్నర గంటల్లోపే చేరుకోగలదని పేర్కొంది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న హైస్పీడ్ బుల్లెట్‌ ట్రైన్‌లో ఈ దూరం ప్రయాణించాలంటే ఐదున్నర గంటల టైమ్ పడుతుంది. అదే ఫ్లైట్‌లో వెళ్లాలంటే 3 గంటలు ప్రయాణించాలి. ఈ మ్యాగ్‌లెవ్‌ ట్రైన్ ట్రాన్స్‌పోర్ట్  సిస్టమ్‌లో రైలు పట్టాలను టచ్ చేయకుండానే దూసుకెళ్తుంది. విద్యుదయస్కాంత శక్తి (ఎలక్ట్రోమయాగ్నెటిక్ ఫోర్స్) ద్వారా  ట్రాక్‌కు కొంచెం ఎత్తులో రైలు హైస్పీడ్‌తో ప్రయాణిస్తుంది. దాదాపు 20 ఏండ్లుగా మ్యాగ్‌లెవ్ టెక్నాలజీని వాడుతోంది. చైనాలోని ఒక ఎయిర్‌‌ పోర్టు నుంచి షాంగైకి ఎప్పటి నుంచి ఈ మ్యాగ్‌లెవ్ ట్రాన్స్‌పోర్ట్ ఉంది. అయితే ఇంకా చైనాలో ఏ రెండు సిటీలు, రాష్ట్రాల మధ్య ఈ ట్రాక్‌లు పూర్తి స్థాయిలో లేవు. షాంగై, చెంగ్డూతో పాటు మరికొన్ని సిటీలు మ్యాగ్‌లెవ్ ట్రైన్‌ రీసెర్చ్‌ కోసం ట్రాన్‌ను సిద్ధం చేస్తున్నాయి. త్వరలో దీని కావాల్సిన పూర్తి స్థాయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌ను పెద్ద పెద్ద సిటీల మధ్య నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది.