చైనాలో భారీ వర్షాలకు ఉప్పొంగుతున్న నదులు

చైనాలో భారీ వర్షాలకు ఉప్పొంగుతున్న నదులు

చైనాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు అక్కడి ప్రజలను అతలాకుతలం చేస్తు్న్నాయి. ఏకధాటి వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో కాలువలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. పెర్ల్ రివర్ బేసిన్ గత వందేళ్లో ఎన్నడూ లేనంత స్థాయిలో ఉప్పొంగుతోంది. ఈ క్రమంలో పలు గ్రామాలకు రాకపోకలు తెగిపోయి, ఇళ్లలోకి వరద నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అయితే దక్షిణ చైనాలోని కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు పడే అవకాశమున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అన్ని కార్యాలయాలు, పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. దుకాణాలు, భవనాల్లోకి వరద నీరు చేరడంతో నిత్యావసరాలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. దీంతో అధికారులు కొన్ని చోట్ల ఇప్పటికే వరద హెచ్చరికను జారీ చేశారు.