శ్రీలంక పోర్టుకు చైనా నిఘా నౌక

శ్రీలంక పోర్టుకు చైనా నిఘా నౌక

వందలాది కిలోమీటర్ల దూరం పాటు భూతలం, గగనతలంపై నిఘా పెట్టే  చైనా అధునాతనమైన ‘యువాన్ వాంగ్ 5’ నౌక ఇది. ఇండోనేసియా మీదుగా శ్రీలంకకు దక్షిణాన ఉన్న హంబన్ టోట పోర్టుకు చైనా దీనిని తరలిస్తోంది. ఈ నెల 11 నాటికి అక్కడికి చేరుకునే ఈ షిప్ 17 వరకూ అక్కడే ఉండనుంది. మన దేశంలో జరిగే బాలిస్టిక్ మిసైల్ టెస్టులను ట్రాక్ చేయడంతోపాటు, ఏపీ, కేరళ, తమిళనాడులోని కీలక పోర్టులు, కల్పక్కం, కూడంకుళం వంటి అణు కేంద్రాల సమచారాన్నీ ఇది సేకరించగలదు. అయితే, ఈ షిప్ కదలికలను గమనిస్తున్నామని, ఇండియా భద్రతకు ముప్పు కలిగే పరిస్థితి వస్తే తగిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.