సాప్ట్ వేర్ సంస్థలను వదిలి.. వెయిటర్ గా చేరుతున్న యువత.. ఎక్కడంటే

సాప్ట్ వేర్ సంస్థలను వదిలి.. వెయిటర్ గా చేరుతున్న యువత.. ఎక్కడంటే

చైనాలో సోషల్ మీడియాలో  ఆ దేశానికి సంబంధించిన కొత్త ట్రెండ్‌లు కనిపిస్తున్నాయి. నిరుద్యోగం ప్రపంచ వ్యాప్తంగా తాండవిస్తున్నా ..  చైనాలో మాత్రం  కొత్త రికార్డును సృష్టిస్తోంది.   ఇక్కడ చాలా మంది యువత ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాలను వదిలి  చాలా తక్కువ జీతం వచ్చే ఉద్యోగాలను అన్వేషిస్తున్నారు.  

ప్రపంచ వ్యాప్తంగా జనాలు వీలుంటే ఆరంకెల జీతం.. లేదంటే ఐదంకెల జీతం కోసం తాపత్రయపడతారు. ఉద్యోగాలు కల్పించి.. అధిక జీతాలు ఇచ్చిన సాఫ్ట్ వేర్ సంస్థల్లో ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో.. ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి ఉంది. సాఫ్ట్ వేర్ జాబ్ అంటే శారీరక శ్రమ ఉండదు..అలసట ఉండదు.. ఏసీ.. కంప్యూటర్ ఇలా అనేక సౌకర్యాలు ఉంటాయి. అలాంటి సంస్థల్లో పనిచేయాలని అందరూ అనుకుంటారు. కాని చైనాలో మాత్రం ప్రస్తుతం మాకు అలాంటి ఉద్యోగాలు  వద్దంటూ... వెయిటర్ గానో.. స్వయం ఉపాధి ఉద్యోగాలను అన్వేషిస్తున్నారు. యువత ఇంత ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాలను ఎందుకు వదులుకుంటున్నారంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ యజమానులు, క్లీనర్లు, వెయిటర్ల నుండి పెంపుడు జంతువులను అలంకరించడం లాంటి పనుల్లో  యువకులు  ఉపాధిని వెతుక్కుంటున్నారు.

చైనా యువత... 

మహిళలతో సహా  అధిక జీతం వచ్చే ఉద్యోగాలను వదిలివేసి..తమ వేతనాలలో కొంత భాగాన్ని చెల్లించే మాన్యువల్ లేబర్ ఉద్యోగాల్లో చేరుతున్నారు. వీటిలో వెయిటర్, క్యాషియర్, బారిస్టా మొదలైన ఉద్యోగాలు ఉన్నాయి. చైనాలోని లియానింగ్‌కు చెందిన 25 ఏళ్ల యువతి తన సోషల్ మీడియా ఖాతాలో అధికజీతంవచ్చే కన్పల్టింగ్ ఉద్యోగాన్ని వదిలిపెట్టినట్లు రాసింది. మహిళతాను ఉద్యోగంతో పాటుఅంతులేని ఇమెయిల్‌లు,ఇంటర్వ్యూలు,పిపిటిమొదలైనవాటిని వదిలించుకున్నానని తెలిపింది.  ఇప్పుడు బరిస్టాగా కొత్త జీవితం ప్రారంభించానని తెలిపింది.  ప్రస్తుత  నెలవారీ జీతం తన పాత జీతంతో పోలిస్తే చాలా తక్కువని తెలిపింది.  అయినా చాలా సంతోషంగా ఉన్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని అక్కడి వార్తా సంస్థలు వెల్లడించాయి.  

మాకు ఆ జాబ్ లు  వద్దు

ఎక్కువ సామర్ధ్యాలు ఉన్న విద్యావంతులకు ఉపాధి లభించక  నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అయితే   చైనా ఆధారిత మాతృ సంస్థ టిక్‌టాక్ లో  బైట్‌డాన్సర్  పనిచేస్తున్న చైనా మహిళ ఆ ఉద్యోగాన్ని వదిలి...ఈటర్‌ను ఓపెన్ చేసి  రోజంతా వంట చేస్తోంది. టిక్ టాక్ కంపెనీని విడిచిపెట్టిన తర్వాత తాను చాలా సంతోషంగా ఉన్నానని ఆమె సోషల్ మీడియాలో రాసింది. ఈ ఉద్యోగంలో ఆమె శరీరం అలసిపోయినా..మనస్సు చాలా సంతోషంగా ఉందని చెప్పింది.గత కొన్ని సంవత్సరాలుగా, చైనాలోని ఈ ట్రెండ్ అక్కడి సోషల్ మీడియా Instagram వెర్షన్ Xiaohongshu వీడియోలు, ఫోటోలు కనిపిస్తున్నాయి. జనాలు వారు చేసే పనుల గురించి సమాచారాన్ని పంచుకుంటున్నారు. మై ఫస్ట్ ఫిజికల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్  అనే హ్యాష్‌ట్యాగ్ జూన్ 12 నాటికి ప్లాట్‌ఫారమ్‌లో 30 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించింది.

చైనీస్ సోషల్ మీడియాలో  ట్రెండ్

పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నవారు చిన్న ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేయడం భారతదేశంలో తరచుగా వినిపిస్తుంటాయి. అవసరానికి అనుగుణంగా ఉద్యోగాలు సృష్టించడం లేదు. చైనాలో కూడా అలాంటిదే జరుగుతోంది. అలాగే నిరుద్యోగుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. అయితే దీనికి తోడు చైనాలో కొత్త వ్యాపారం కనిపిస్తోంది. అక్కడ, పెద్ద సంఖ్యలో యువకులు అధిక జీతంతో కూడిన ఉద్యోగాలను వదిలి వెయిటర్ గానూ..  ఇతర స్వయం ఉపాధి ఉద్యోగాలు చేస్తున్నారు. అంతే కాదు  అధిక జీతం వచ్చే ఉద్యోగాలను వదిలి సోషల్ మీడియాలో వారి ఫొటోలు  , వీడియోలను షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యువత తమ అభిప్రాయాలను పరిశీలిస్తే  వైట్ కాలర్ జాబ్ పట్ల సంతృప్తిని వ్యక్తం చేయడం లేదని తేలింది.  అదే సమయంలో తక్కువ జీతం ఉన్న ఉద్యోగంలో శారీరక శ్రమ ఉన్నా...  మంచి అనుభూతి ఉందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.