
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన బెస్ట్ సినిమాల లిస్టులో చూడాలని ఉంది(Choodalani Vundi) తప్పకుండా ఉంటుంది. దర్శకుడు గుణశేఖర్(Gunasekhar) తెరకెక్కించిన ఈ యాక్షన్ అండ్ ఫామిలీ ఎంటర్టైనర్ చిరంజీవి కెరీర్ లో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్(Aswani datt) నిర్మించిన ఈ సినిమా 150 డేస్ ప్రదర్శింపబడి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 1998 ఆగస్టు 27న రిలీజై అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాలో సౌందర్య(Soundarya), అంజలి జవేరి(Anjala zaveri), ప్రకాష్ రాజ్(Prakash raj) ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా రిలీజై ఆగస్టు 27 2023 నాటికి 25 సంవత్సరాలు పూర్తయింది. ఈ సంధర్బంగా దర్శకుడు గుణశేఖర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన చూడాలని ఉంది సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పకొచ్చారు.
మరీ ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి, అంజలి జవేరి మధ్య రైల్వే స్టేషన్ లో జరిగే సీన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు గుణశేఖర్. ఈ సీన్ ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలిచూపులోనే ప్రేమ పుట్టడం అనే కాన్సెప్ట్ ని ఎంతో గొప్పగా, చాలా అందంగా చూపించాడు గుణశేఖర్. మొత్తం 10 నిమిషాల పాటు సాగే ఈ సీన్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తుంది.
అయితే ముందు ఈ సీన్ ను చిరంజీవికి చెప్పినప్పుడు.. పవన్ కళ్యాణ్ తో తీయాల్సిన సీన్ ను నాతో ప్లాన్ చేశావేంటి అని అడిగారట. తరువాత గుణశేఖర్ ఈ సీన్ గురించి వివరించిన తీరు చిరుకి బాగా నచ్చడంతో ఒప్పేసుకున్నారట.
ఇక ఈ సీన్ కోసం గుణశేఖర్ 20పేజీల స్క్రిప్ట్ రాసుకున్నారట. 10 నిమిషాల నిడివి ఉండే ఈ సీన్ లో చిరంజీవికి గానీ, అంజలి జవేరికి కానీ ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా ఉండదు. కానీ చూసే ప్రేక్షకులకు మాత్రం ఎక్కడ ఆ ఫీలింగ్ కలగకుండా చాల అద్బుతంగా చిత్రీకరించారు. ఇక ఆ సన్నివేశానికి తగినట్టుగా మణిశర్మ అందించిన సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇద్దరి మధ్య కళ్ళతో పుట్టే ప్రేమకు జస్ట్ పియానోతో ఆయన అందించిన మ్యూజిక్ ఆడియన్స్ మనసులను హత్తుకుంది. ఇక చోటా కే నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. రియాలిటీకి దగ్గరగా ఉండాలని ఆ సీన్ ను నాంపల్లి రైల్వే స్టేషన్ లో తీశారట. చిత్రీకరణ సమయంలో చిరంజీవిని చూడటానికి వేళా మంది అక్కడికి చేరుకోవడంతో చాలా ఇబ్బంది పడ్డారట యూనిట్. కానీ చోటా కే నాయుడు కి ఉన్న కెమెరా అనుభవంతో మూడు రోజులు అనుకున్న ఆ సీన్ ను కేవలం రెండు రోజుల్లోనే ఫినిష్ చేసేసారట.
పాతిక సంవత్సరాలు కాదు ఇంకో పాతికేల్లైన ఆ సీన్ కు ఉన్న అందం ఈమాత్రం తగ్గడనడంలో ఎలాంటి సందేహంలేదు. ఇక చూడాలని ఉంది సినిమా ఇప్పటికే టీవీలో వచ్చినా మిస్ అవకుండా చూసేవాళ్ళు చాలామందే ఉన్నారు.