V6 News

Venkatesh: జీరో హేటర్స్ హీరో.. వెంకీ మామ బర్త్డే స్పెషల్.. క్రేజీ అప్డేట్తో అదరగొట్టిన అనిల్ రావిపూడి

Venkatesh: జీరో హేటర్స్ హీరో.. వెంకీ మామ బర్త్డే స్పెషల్.. క్రేజీ అప్డేట్తో అదరగొట్టిన అనిల్ రావిపూడి

దగ్గుబాటి వెంకటేష్ (Venkatesh).. తన పేరుకు ముందే విక్టరీ (VICTORY) అనే ట్యాగ్తో సినిమా ఇండస్ట్రీలో ఒక పదిలమైన స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అత్యధిక నంది అవార్డులు అందుకున్న యాక్టర్గా టాలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.

ఎంత పెద్ద స్టార్ హీరోకైనా..ఫ్యాన్స్తో పాటు హేటర్స్ కూడా పెరుగుతూ వస్తుంటారు. కానీ, విక్టరీ వెంకటేష్కు మాత్రం జీరో హేటర్స్ మాత్రమే ఉంటారు. ఎందుకంటే, తన ప్రతి సినిమాతో నవ్వుతూ..నవ్విస్తాడు..ప్రేమతో కవ్విస్తాడు..ఏడుస్తూ ఏడ్పిస్తాడు..అందుకే, సినిమా సినిమాకి అందరి మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు.

వెంకటేష్కి అధ్యాత్మిక చింతన ఎక్కువ. జీసస్‌, రమణ మహర్షి, వివేకానంద, రామకృష్ణ పరమహంస, జిడ్డు కృష్ణమూర్తి తదితరుల పుస్తకాలు చదివిన తర్వాత తన జీవితం మారిపోయిందని ఓ ఇంటర్వ్యూలో వెంకటేశ్‌ తెలిపారు. అంతేకాకుండా తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని, ఒక్కరోజు కూడా ధ్యానం చేయకుండా ఉండలేనని పలు వేదికలపై వెంకటేష్ చెప్పిన విషయం తెలిసిందే.

తాను హీరోగా తెరకెక్కిన తొలి సినిమా ‘కలియుగ పాండవులు’ నుంచి ‘సంక్రాంతికి వస్తున్నాం’ వరకు తనదైన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్కు చేరువయ్యారు. 1960 డిసెంబర్ 13న ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించిన వెంకటేష్.. నేటితో 65వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్బంగా ఆయన ఫ్యాన్స్, సినీప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

►ALSO READ | Akhanda 2 Collections: అఫీషియల్.. ‘అఖండ 2’ ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రకటించిన మేకర్స్..

నా ప్రియమైన వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని మెగాస్టార్ చిరంజీవి విషెష్ తెలిపారు. ‘‘ఎల్లప్పుడూ పాజిటివిటీని తీసుకొచ్చే నా ప్రియమైన వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మనశంకరవరప్రసాద్‌గారు సినిమా షూటింగ్ సమయంలో మనం పంచుకున్న ప్రతి క్షణాన్ని నేను ఎంతో ఆస్వాదిస్తాను. మీరు ప్రతిక్షణం మరింత ఆనందమైన క్షణాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను’’అని చిరు విషెష్ అందించారు. ఈ మేరకు చిరు అప్ కమింగ్ రిలీజ్ మూవీ నుంచి పోస్టర్ పంచుకున్నారు.

అలాగే, డైరెక్టర్ అనిల్ రావిపూడి విషెష్ చెబుతూ.. ‘ప్రియమైన విక్టరీ వెంకీ సార్.. పుట్టినరోజు శుభాకాంక్షలు. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాము. మనశంకరవరప్రసాద్‌గారితో కలిసి అదరగొట్టేద్దాం’ అని అనిల్ ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. 

వెంకటేష్- త్రివిక్రమ్ కాంబో:

టాలీవుడ్లో స్పెషల్ క్రేజ్ ఉన్న కాంబినేషన్లలో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ జోడీ ఒకటి. గతంలో త్రివిక్రమ్ రచయితగా వెంకీతో కలిసి పనిచేసిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి', లాంటి సినిమాలు తెలుగు సినీ చరిత్రలో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్‌గా నిలిచాయి. వాటిలోని కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. అందుకే ఈ ఇద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేయాలని అభిమానులు దశాబ్దాలుగా కోరుకున్నారు. ఆ కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది. 

'ఆదర్శ కుటుంబం' టైటిల్తో.. 

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు 'ఆదర్శ కుటుంబం హౌస్ నం.47' అనే ఆకర్షణీయమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ టైటిల్‌తో పాటు విడుదల చేసిన పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటుంది. సినీ ప్రముఖులు ప్రశంసలు అందుకుంటుంది. ఈ మూవీ వెంకటష్ కు 77వ చిత్రం (Venky 77).

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ షూటింగ్ హైదరాబాద్‌లోని ప్రముఖ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఇటీవలే మొదలైంది. ఈ సినిమా కథాంశం కుటుంబ విలువలతో కూడిన భావోద్వేగాలను, ఉత్కంఠభరితమైన యాక్షన్‌ను మేళవిస్తుందని తెలుస్తోంది. షూటింగ్‌ను చకచకా పూర్తి చేసి, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

టైటిల్, పోస్టర్ రెండూ కూడా మంచి హోమ్లీ ఫీలింగ్‌ను కలిగిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక, హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తోంది. 

ఉత్తమ నటుడిగా నంది అవార్డులు:

1986 కలియుగ పాండవులు = ఉత్తమ తొలి చిత్ర నటుడిగా 
1988 స్వర్ణకమలం
1989 ప్రేమ 
1995 ధర్మచక్రం
1998 గణేష్ 
2000 కలిసుందాం రా 
2007 ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వేరులే