అనుమానాలు నివృత్తి చేయాల్సిన ..బాధ్యత ఆఫీసర్లదే..

అనుమానాలు నివృత్తి చేయాల్సిన ..బాధ్యత ఆఫీసర్లదే..
  • గవర్నమెంట్​సెక్రెటరీ క్రిస్టినా జడ్​ చొంగ్తూ 
  • బోగస్​ ఓట్ల ఫిర్యాదుపై  గ్రౌండ్​ విజిట్
  • నిజామాబాద్​, బోధన్​ సెగ్మెంట్​పై ప్రత్యేక దృష్టి

నిజామాబాద్​,  వెలుగు :  బోగస్​ ఓట్లపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఆఫీసర్లదేనని గవర్నమెంట్​సెక్రెటరీ క్రిస్టినా జడ్​ చొంగ్తూ అన్నారు. శనివారం నిజామాబాద్​, బోధన్​ నియోజకవర్గాలలో బోగస్​ ఓట్లపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఓటర్​నమోదు కోసం వస్తున్న ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాకే లిస్టులో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పొలిటికల్​పార్టీ లీడర్లతో మీటింగ్​ నిర్వహించారు. 

బోగస్​ ఓటర్లు లేని లిస్టు తయారు చేసే విషయంలో రాజకీయ పార్టీల నేతలు సహకారం అందించాలన్నారు. డ్రాఫ్ట్​ లిస్టులోని పేర్లపై అనుమానాలు ఉంటే తెలుపాలన్నారు. ఎలక్షన్​ కమిషన్​  విధివిధానాలకు లోబడి అందరూ పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఉల్లంఘనలకు పాల్పడేవారిపై చర్యలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, యాదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

Also Raed:ఐటీ ఉద్యోగాల్లో..బెంగళూరును దాటేశాం : మంత్రి కేటీఆర్

ఆర్మూర్ :   ఓటర్ నమోదు కార్యక్రమం చివరి దశకు చేరుకున్నందున పొరపాట్లు జరుగనివ్వద్దని ఎలక్టోరల్​​అబ్జర్వర్​ క్రిస్టినా జడ్ చోంగ్తు అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ లో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాన్ని పరిశీలించి తగు సూచనలు చేశారు. ఓటర్ నమోదు కేంద్రంలో దరఖాస్తులు చేసుకున్నవారి జాబితాను పరిశీలించారు. 19వ తేదీ వరకు నూతన ఓటర్ల నమోదుకు అవకాశం ఉన్నందున వయోజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

మరణించిన వారిని జాబితా నుంచి తొలగించే కార్యక్రమం పక్కగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్​, ఆర్డీవో వినోద్ కుమార్, తహసీల్దార్ శ్రీకాంత్, డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కాంత్, ఆర్ ఐ అశోక్ సింగ్, ఓటరు నమోదు అధికారులు చెన్న గంగామోహన్, మమత తదితరులు ఉన్నారు.