యోగా, ప్రాణాయామం చేయండి.. కరోనా రికవరీలకు సర్కార్ సూచనలు

యోగా, ప్రాణాయామం చేయండి.. కరోనా రికవరీలకు సర్కార్ సూచనలు

న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకున్న చాలా మంది పేషెంట్స్‌‌‌లో వినూత్న లక్షణాలు బయట పడుతుండటం ఎక్కువవుతోంది. ముఖ్యంగా అలసట, శరీర నొప్పులు, దగ్గు, గొంతు నొప్పితోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రికవరీ పేషెంట్స్‌‌కు కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు జారీ చేసింది. రికవరీల ఆరోగ్యం దృష్ట్యా కొన్ని సూచనలు చేస్తున్నామని తెలిపింది. మాస్కులు కట్టుకోవడం, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడంతోపాటు తప్పనిసరిగా సోషల్ డిస్టెన్సింగ్‌‌‌ను పాటించాలని పేర్కొంది.

‘ఇమ్యూనిటీని పెంచుకునేందుకు చ్యవన్‌‌ప్రాశ్ తినడం, యోగా, ప్రాణాయామం చేయడంతోపాటు నడవడం మంచింది. తరచూ శరీర ఉష్ణోగ్రతను చెక్ చేసుకోవడంతోపాటు బ్లడ్ ప్రెజర్‌‌నూ మానిటర్ చేస్తూ ఉండాలి. డాక్టర్ల సలహా తీసుకొని పల్స్ ఆక్సీ మీటర్ ద్వారా ఆక్సిజన్ లెవల్స్‌‌ రీడింగ్‌‌ను చూసుకోవాలి. డయాబెటిక్ పేషెంట్స్ రెగ్యులర్‌‌గా బ్లడ్ సుగర్ లెవల్స్‌‌ను చెక్ చేసుకోవాలి. అవసరమైతే మెంటల్ హెల్త్ సపోర్ట్ కోసం వైద్యుల సూచనలు తీసుకోవాలి. కరోనా నుంచి కోలుకున్న వారు తమ అనుభవాలను ఇతరులతో పంచుకోవాలి. తద్వారా వారిలో వైరస్ గురించి అవగాహన పెరుగుతుంది’ అని కేంద్రం గైడ్‌‌‌‌లైన్స్‌‌లో వివరించింది.