
మఠంపల్లి, వెలుగు: విధి నిర్వహణలో మృతిచెందిన జీపీ కార్మికుడి కుంటుంబానికి న్యాయం చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్చేశారు. శుక్రవారం వివిధ గ్రామాల జీపీ కార్మికులతో కలిసి మఠంపల్లి మండలంలోని బక్కమంతుల గూడెం మెయిన్ రోడ్డు పై ధర్నా చేపట్టారు. బక్కమంతల గూడెంలో ఈ నెల 8న పంచాయతీ కార్మికుడు ఏడుకొండలు ఓవర్ హెడ్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులోనే పడిపోయాడన్నారు.
తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడని పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఎంపీడీవో వెంకటాచారి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.